బాబు బ్యాచ్ కి ప్రచారం మరీ ఎక్కువైందట

Update: 2016-10-02 06:26 GMT
మోతాదు మించిన ప్రచారం అంత మంచిది కాదు. అధికారపక్ష నేతలే కాదు.. వారి మాటల్లోని మర్మాన్ని విప్పి చెప్పేందుకు విపక్ష నేతలు.. మీడియా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతూ.. తమకు నచ్చినట్లుగా వ్యవహరించటం ఏమాత్రం సరికాదన్న విషయం ఏపీ అధికారపక్షానికి అర్థమయ్యే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ప్రతి అంశంపైనా విపరీతమైన ప్రచారం చేసుకోవటం.. జరిగే లబ్ధితో పోలిస్తే.. చేసుకునే ప్రచారం ఎక్కువగా ఉండే తీరుపై తాజాగా ఏపీ విపక్ష ఎమ్మెల్యే.. ఏపీ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

 కేంద్రం నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవటం.. ఏపీ పట్ల మోడీ సర్కారుకు అంతులేని ప్రేమాభిమానాలు ఉన్నాయన్నట్లుగా చెప్పే మాటల్లో నిజం లేదన్న విషయాన్ని చెప్పటమే కాదు.. ఇలాంటి ప్రచారంతో ప్రజల్ని మభ్య పెట్టినట్లుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బుగ్గన.

ఇటీవల ప్రత్యక్ష పన్నుల్లో వెనుకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్ని ఎంపిక చేయటం తెలిసిందే. దీనిపై ఏపీ సర్కారు అమితంగా ప్రచారం చేసుకోవటం ఏ మాత్రం సరికాదన్నది బుగ్గన వాదన. ఎందుకిలా అంటే.. కేంద్రం ప్రకటించిన తాజా రాయితీ ఏపీకి మాత్రమే కాదని.. ఏపీతో పాటు.. తెలంగాణ.. బీహార్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా ప్రకటించటాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.  కేంద్రం ప్రకటించిన వెనుకబడిన జిల్లాల రాయితీలు గొప్పవేమీ కాదని.. ఒకవేళ అంత గొప్పవే అయితే.. ఏపీతో పాటు ప్రకటించిన మిగిలిన రాష్ట్రాల వారు ఎందుకు ప్రచారం చేసుకోవటం లేదని.. కేవలం ఏపీ మాత్రమే గొప్పగా చెప్పుకోవటం ఏమిటంటూ బుగ్గన చేసిన విమర్శలో నిజం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News