నంద్యాల ఉప ఎన్నికలో అన్ని తప్పులూ చేస్తున్న అధికార టీడీపీ నేతలు.. ఆ తప్పులను వైసీపీ పైకి నెట్టాలని చూస్తున్నట్టు వైసీపీ అధికార ప్రతినిధి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. నంద్యాల పోరులో జగన్ దెబ్బకి ఓడిపోయి గిలగిలా తన్నుకు లాడడం తప్పదని తెలిసిపోయి.. చంద్రబాబు అతి నీచాతి నీచానికి కూడా ఒడిగడుతున్నారని ఆరోపించారు. వైసీపీకి సభలకు వెళ్లినవారికి పింఛన్లు కట్ చేస్తామని రేషన్ ఆపేస్తామని - మంజూరైన ఇళ్లను సైతం నిలిపేస్తామని బెదిరిస్తున్నట్టు బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందాని ప్రశ్నించారు.
నంద్యాలలో గెలుపు ఇక వైసీపీది అని కేంద్ర నిఘా సంఘాలు కూడా స్పష్టం చేసేయడంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదని బుగ్గన దుయ్యబట్టారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. ఎలాగైనా ఎన్నికలను నిలిపివేయించాలని ప్లాన్ పన్నినట్టుగా తమకు అనుమానం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది టీడీపీ నేతలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ సభలకు నంద్యాలలో వాడవాడలా జనం పోటెత్తుతున్నారని, వారిని చూసి బాబు ఓర్చుకోలేక పోతున్నారని, అందుకే ఎలాగైనా ఇక్కడ అలజడి సృష్టించి ఎన్నికలు ఆపేయాలని నిర్ణయించుకున్నారని బుగ్గన ధ్వజమెత్తారు.
ఓటుకు రూ.5 వేల చొప్పున పంచేందుకు సిద్ధమైంది ఎవరో కూడా అందరికీ తెలుసునని బుగ్గన చెప్పారు. చంద్రబాబు తాను చేయదలుచుకున్న కుట్రలను ఎదుటువారు చేస్తారని అనుకోవడం పొరపాటనిఅన్నారు. బాబు గురించి తమకు ముందే తెలుసునని, అందుకే గతంలోనే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. తాము ఫిర్యాదు చేశామని వివరించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలు ప్రజలే తిప్పికొడతారని అన్నారు. వైసీపీ అభ్యర్థి గెలుపును చంద్రబాబు ఆపలేరని అన్నారు.