వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పైనా విమర్శలకు దిగుతున్నారు. తీవ్ర గందరగోళానికి కారణమవుతుండడంతో ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయగా వారు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు దిగారు. అందుకు ప్రతి విమర్శలకు దిగిన టీడీపీ కూడా జగన్‌ను మించిన ఫ్యాక్షనిస్టు లేరంటూ విరుచుకుపడింది. దీంతో వైసీపీ అనవసరంగా గెలుక్కున్నట్లయింది.
సాధారణంగా ఏ పార్టీ అయినా స్పీకర్ విషయంలో కొంత ఆచితూచి మాట్లాడుతుంది. కానీ వైసీపీ మాత్రం స్పీకర్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించింది. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెలను ఫ్యాక్షనిస్టు అంటూ ఆరోపించారు. అంతేకాదు, జోకర్ అంటూ ఎగతాళి చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల నుంచి ప్రతిఘటన ఎదురైంది. 400 మంది టిడిపి కార్యకర్తలను, మాజీ మంత్రి పరిటాల రవి ని చంపించిన వ్యక్తి జగన్ అని, ఏకైక ఫాక్షనిస్టు జగన్ అని టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,వై.శ్రీనివాసరావు మండిపడ్డారు. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.