వయసు మీద పడుతున్నా పోరాట పటిమ తగ్గని నాయకుల్లో టీడీపీ రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. ఎన్నోసార్లు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారాయన. పలుసార్లు అధినేత చంద్రబాబుతోనే విభేదించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో సీనియర్ బుచ్చయ్యనే. అధికార వైసీపీలోని ఎమ్మెల్యేలనూ చనువుగా పలకరించగల వ్యక్తి బుచ్చయ్య చౌదరి.
తాను రాజకీయాల్లోకి వచ్చి ఏం సంపాదించుకున్నది లేదని.. అంతకుముందే ఏడాదికి లక్షల్లో ఆదాయ పన్ను కట్టే వారమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. మరోవైపు గత టర్మ్ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కకపోవడంపై బుచ్చయ్య బహిరంగంగానే మండిపడ్డారు. ఆ తర్వాత సద్దుమణిగారు.
ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో పార్టీకి మంచి వాయిస్ లా ఉపయోగపడుతున్నారు బుచ్చయ్య. పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా ఓటీఎస్ అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ కే సవాల్ విసిరారు.
నిరూపిస్తా.. లేదంటే
‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారూ.. మీకిదే నా సవాల్. మీడియా ముందే నిరూపిస్తా..' అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం ఓటీఎస్ అంశం రాజకీయ విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనదైన శైలిలో సమర్ధించుకుంటుండగా, ప్రతిపక్ష టీడీపీ మాత్రం విమర్శలు చేస్తోంది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం దీనిపై నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.
అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా.. ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. పురపాలక మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో కొత్తగా వేసే లే అవుట్లపై 5 శాతం స్థలాన్ని వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ఇవ్వాలని.. అలా ఇవ్వలేని పక్షంలో దానికి సమానంగా డబ్బు అయినా చెల్లించాలని జీవో జారీ చేయడం శోచనీయమన్నారు.
లే అవుట్ల స్థలాల్లో 5 శాతం జగనన్న కాలనీలకి ఇవ్వాలని చెప్పడం సబబేనా..? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు. మీడియా ముందు నిరూపించడానికి.. బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. బొత్స అబద్ధాలడుతున్నారని.. సీఎం జగన్‌కే సవాల్ చేస్తున్నానని అన్నారు.
నిరూపించకకుంటే రాజీనామా
తాను చేసిన ఆరోపణల నిరూపించపోతే రాజీనామా చేస్తామని.. నిరూపిస్తే ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధమా..? అంటూ బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చిన నాబార్డ్, హడ్కో, ఇతర బ్యాంకులు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భగా ఆయన ట్వీట్టర్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను షేర్ చేశారు.