కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ మొన్న కడప కేంద్రంగా చేసిన దీక్షపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. టీడీపీ సీనియర్ నేత - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ - కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేపట్టిన నిరాహార దీక్ష... ఏమీ సాధించకుండానే ముగిసిపోయింది. దీక్ష మొదలెట్టిన ఏడు రోజులకు బీటెక్ రవి దీక్షను విరమించేసి ఆసుపత్రి బెడ్‌పైకి చేరగా... ఆయన కంటే వయసులో పెద్ద - బీపీ షుగర్ ఉన్న సీఎం రమేశ్ మాత్రం ఏకంగా పది రోజుల పాటు దీక్షను కొనసాగించారు. పది రోజుల పాటు అన్నం ముద్ద ముట్టని సీఎం రమేశ్ చాలా చలాకీగా కనిపించిన వైనం... అసలు దీక్షలో సీఎం రమేశ్ ఆహారం స్వీకరించలేదా? అన్న అనుమానాలను రేకెత్తించింది. సరే.... దీక్ష ఎలాగూ ముగిసింది కాబట్టి... ఆ విషయాన్ని పక్కనబెడితే... దీక్షకు దిగితే ఏదో ఒకటి సాధించాలి కదా. అందులోనూ సీఎం రమేశ్ దీక్షను విరమింపజేసేందుకు ఏకంగా అమరావతి నుంచి కడప దాకా వెళ్లిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... సీఎం రమేశ్ ను అమరజీవి పొట్టి శ్రీరాములుతో పోల్చడమే కాకుండా... పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షను వక్రీకరించేసి తనదైన శైలి ప్రసంగం చేశారు. ఇక సీఎం రమేశ్ పది రోజుల పాటు దీక్ష చేసినా కేంద్రం స్పందించలేదని, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, మరో రెండు నెలల పాటు కేంద్రానికి డెడ్ లైన్ విధిస్తున్నామని, ఆలోగా కేంద్రం స్పందించకుంటే... కడపలో ఉక్కు ఫ్యాక్టరీని తామే కట్టేస్తామని చంద్రబాబు కాస్తంత ఘన ప్రకటనలే చేశారు.
సరే దీక్షలో కూర్చున్న సీఎం రమేశ్ కు నిమ్మరసం ఇచ్చేసిన చంద్రబాబు.. తన దారిన తాను వెళ్లిపోయారు. ఇక్కడే అసలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు సీఎం రమేశ్ దీక్ష ఎందుకు చేసినట్లు? పది రోజుల దీక్ష చేసినా ఏం సాధించకుండానే తనకు తానుగానే దీక్షను ఆయన ఎందుకు విమరించినట్టు? అయినా దీక్షకు అనుమతించిన చంద్రబాబు... సీఎం రమేశ్ ఏం సాధించారని ఆయన దీక్షను విరమింపజేశారు? అసలు ఈ దీక్షకు ఓ దశా దిశా ఉందా? అసలు ఏం ఆశించి ఈ దీక్షకు చంద్రబాబు అనుమతించారు? ఈ దీక్ష వెనుక టీడీపీ వ్యూహమేంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా... బాబు పాలనా తీరు చూసిన జనం లోలోపలే మండిపడుతున్నారు. అయితే ఉద్యమాలే ఊపిరిగా రాజకీయాల్లో సుధీర్ఘ కాలం కొనసాగుతున్న సీపీఎం జాతీయ స్థాయి నేత బీవీ రాఘవులు మాత్రం ఈ దీక్షను ఏకిపారేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాఘవులు కాసేపటి క్రితం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేశ్ దీక్షను ప్రస్తావిస్తూ... అసలు ఈ దీక్ష ద్వారా చంద్రబాబు ఏం సాధించారో తనకు తెలియడం లేదని కలకలం రేపారు.
అసలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే... అలాంటప్పుడు తమ పార్టీ ఎంపీ అయిన సీఎం రమేష్‌తో దీక్ష చేయించడం ఎందుకు? విరమింపజేయడం ఎందుకు?... అని రాఘవులు... చంద్రబాబుకు సూటి ప్రశ్నలే సంధించారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే కడపలో ఉక్కు పరిశ్రమను పెట్టాలనుకుంటే నాలుగేళ్ల క్రితమే కేంద్రానికి ఓ లేఖ రాస్తే సరిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే కేంద్రం దానికి అనుమతి ఇచ్చేదీ లేనిదీ తేలిపోయేదన్నారు. రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ పెట్టాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలు ఏ రాజకీయ ప్రయోజనాల కోసమని కూడా రాఘవులు కాస్తంత గట్టిగానే ప్రశ్నించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై బీజేపీ చేస్తున్న వాదనల్లో అసలు వాస్తవాలే లేవని రాఘవులు వ్యాఖ్యానించారు. కడపకు సమీపంలో ఇనుప ఖనిజాలు లేవనడం - సముద్రం దగ్గరలో లేదనడం - అనుమతులు ఇవ్వలేమనడం చూస్తుంటే ఈ విషయాన్ని ఏదో రకంగా దాటవేయడానికే కేంద్రం ప్రయత్నిస్తోందని అర్థమవుతోందన్నారు. దేశంలో ఉక్కు పరిశ్రమలు అన్నీ సముద్రాలకు దగ్గరలో ఉన్నాయా?...ఎక్కడో జపాన్ లో ఉన్న ఉక్కు పరిశ్రమలకు భారత దేశం నుంచి సముద్రాల ద్వారా ఇనుప ఖనిజాలు వెళ్లడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
నాలుగేళ్ల పాటు బీజేపీ చేస్తూ వస్తున్న తప్పిదాలను టీడీపీ సమర్థిస్తూ రావడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం జరిగిందని రాఘవులు తప్పుబట్టారు. అందువల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ బాధ్యత వహించక తప్పదన్నారు. ఇప్పటికైనా అన్ని విధాలా వెనుకబడిన రాయలసీమకు స్టీలు ఫ్యాక్టరీ వస్తేనే అభివృద్ది చెందుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన తప్పిదాలను అంగీకరించి అన్ని పార్టీలతో కలిసి పోరాడాలని, అలా చేస్తేనే కడప ఉక్కు పరిశ్రమ వస్తుందని రాఘవులు సూచించారు. మొత్తంగా ఉక్కు దీక్ష అంటూ తన ఎంపీ చేత ఓ డ్రామా ఆడించిన చంద్రబాబును రాఘవులు నిండా కడిగిపారేయడమే కాకుండా... ఏపీకి జరిగిన ప్రతి అన్యాయానికి బాబు అండ్ కోలదే తప్పంటూ తేల్చేశారు. మరి రాఘవులు ప్రశ్నలకు బాబు అండ్ కో ఏం సమాధానాలు ఇస్తుందో చూడాలి.