రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు - తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్త కార్యక్రమంతో సీమ సెంటిమెంట్ ను రాజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గత ఏడాది గోదావరి పుష్కరాలు నిర్వహించి - ప్రస్తుతం కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బైరెడ్డి కొత్త ఎజెండా ముందుకు తెచ్చారు. రాయలసీమ పుష్కరాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో...సొంతంగా ఆయనే సీమ పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేసేశారు.
తన స్వగ్రామం ముచ్చుమర్రిలో రాయలసీమ పుష్కరాల కోసం బైరెడ్డి ఏర్పాట్లు చేశారు. సొంతంగా ఘాట్ నిర్మించడమే కాకుండా పుష్కర కార్యక్రమాలకు తగిన విధంగా సిద్ధం చేశారు. అయితే దీనిపై పలువురు కలెక్టర్లుకు ఫిర్యాదు చేయడంతో పనులను నిలిపివేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 25వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని గ్రామ కార్యదర్శి - వీఆర్ ఓల ఆధ్వర్యంలో దండోరా వేయించారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రత్యేకతను చాటేందుకు తాను పుష్కరాలకు శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు. ఈ పుష్కరాల కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయలేదని, సొంత ఖర్చుతో భక్తులకు పుష్కర స్నానాలు చేసుకొనేందుకు ఘాట్ ను ఏర్పాటుచేయడం తప్పేనా అంటూ ప్రశ్నించారు. దీన్ని కూడా రాజకీయం చేస్తే ఏమనాలి అంటూ వాపోయారు.
ప్రభుత్వం ఎంత అణిచివేసినా సీమ పుష్కరాలు నిర్వహిస్తామని బైరెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 12వ తేదీన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వెయ్యిమంది ముత్తయిదువులతో హారతి ఇస్తామని ప్రకటించారు. పుష్కర ఘాట్ లో ఏర్పాట్లు చేస్తున్నామని, అంతేకాకుండా ఘాట్ లో మహిళల కోసం అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించామని బైరెడ్డి తెలిపారు. ఇక్కడి పనులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోగా ఆపివేయాలని హుకుం జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. గ్రామంలో 144 సెక్షన్ తొలగించకపోతే దీక్షా చేపడతానంటూ హెచ్చరించారు. ఆసక్తికరంగా ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచితో పాటు కీలక నాయకులు మద్దతివ్వడం విశేషం.