బాబు భేటీతో ప‌వ‌న్ ఇమేజ్ పోయింద‌ట‌

Update: 2015-11-15 08:38 GMT
లింకు లేకుండా మాట్లాడ‌టం ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఈ మ‌ధ్య‌న అల‌వాటుగా మారింది. ఏం మాట్లాడినా.. ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డినా.. వేళ్ల‌న్నీ తమ‌ను చూపించ‌టం.. విభ‌జ‌న పంచాయితీ తెర మీద‌కు రావ‌టం.. కాంగ్రెస్ నేత‌ల నోళ్లు మూత‌ప‌డ‌టం ఈ మ‌ధ్య‌న ఒక అల‌వాటుగా మారింది. ఈ నేప‌థ్యంలోతామేం మాట్లాడుతున్నామో చూసుకోకుండా నోటికి వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌టం ఈ మ‌ధ్య‌న మామూలైంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సి. రామ‌చంద్ర‌య్య చేసిన వ్యాఖ్య‌లు అర్థం ప‌ర్థం లేన‌ట్లుగా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ల‌వ‌టం ద్వారా ఆయ‌న హీరో ఇమేజ్ జీరోగా మారింద‌ని వ్యాఖ్యానించారు. మోడీ ప్ర‌భ త‌గ్గింద‌ని చంద్ర‌బాబు.. ప‌వ‌న్ ను అడ్డు పెట్టుకొని రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నార‌ని.. దీంతో ప‌వ‌న్ ప‌ర‌ప‌తి పోయింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక‌వేళ రామ‌చంద్ర‌య్య మాట‌ల్నే తీసుకుంటే.. చంద్ర‌బాబును క‌లిసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఊరికే వ‌చ్చామా? లంచ్ చేశామా?

బాబు ఇచ్చిన శాలువా.. పూల బొకే.. మెమెంటోనూ పట్టుకొని త‌న దారిన తాను వెళ్లిపోతే అదే నిజ‌మ‌నిపించేది. కానీ.. అందుకు భిన్నంగా రామ‌చంద్ర‌య్య లాంటి వారు సైతం ప్ర‌స్తావించ‌ని బాక్సైట్ త‌వ్వ‌కాల గురించి మాట్లాడ‌ట‌మే కాదు.. అన్నీ పార్టీల‌తో క‌లిపి భేటీ జ‌రిపి.. ఒక నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సిందిగా బాబును కోరిన తీరు చూసిన‌ప్పుడు.. ప‌వ‌న్ హీరో అయ్యారా? జీరో అయ్యారా? అన్న‌ది రామ‌చంద్ర‌య్య‌కే తెలియాలి.

రాజ‌ధాని రైతుల గురించి మాట్లాడ‌టంతోపాటు.. పోత‌పోసిన‌ట్లుగా అభివృద్ధి మొత్తం అమ‌రావ‌తి మీద‌నే కాకుండా.. మిగిలిన ప్రాంతాల‌కు కూడా విస్త‌రించాల‌న్న మాట  ప‌వ‌న్ ఇమేజ్ ను పెంచిందే త‌ప్ప త‌గ్గించింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. నిజానికి.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గ్రౌండ్ లో జ‌రుగుతున్న విష‌యాల‌కు సంబంధించిన ప‌క్కా ఫీడ్‌బ్యాక్ ను అందించి.. త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించి.. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల్ని నేరుగా ఎత్తి చూపి.. త‌న ఇమేజ్ ను మ‌రింత పెంచుకున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంటే.. అందుకు భిన్నంగా రామ‌చంద్ర‌య్య వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News