ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు బీసీలు, కాపుల మధ్య నిప్పు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ నిప్పే ఆయన్ను దహించివేస్తుందని శాపాలు పెట్టారు. చంద్రబాబుతో పాటు గవర్నరు నరసింహన్ పైనా రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రైతులు బాధలు పడుతుంటే, రాజధాని నిర్మాణం బాగా జరుగుతుందని గవర్నర్ నరసింహన్ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. రైతులు బాధలు గవర్నర్ కు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మెప్పు కోసమే గవర్నర్ పనిచేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.
అయితే.. రామచంద్రయ్య విమర్శలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గవర్నరును తిట్టడం ఆయన ఉద్దేశమని.. అయితే.. నేరుగా గవర్నరును టార్గెట్ చేస్తే మళ్లీ ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో చంద్రబాబుతో మొదలుపెట్టి గవర్నరును విమర్శించారని అంటున్నారు. గవర్నరు తమ వినతులను పట్టించుకోకపోవడం.. గతంలో చంద్రబాబుతో విభేదాలున్నా ఇప్పుడు మళ్లీ కలిసిపోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ నేతలు గవర్నరుపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామచంద్రయ్య గవర్నరుపై ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబు రాష్ట్రంలో లేని సమయంలో రామచంద్రయ్య గళం విప్పడంతో ఆయన అసలు టార్గెట్ చంద్రబాబు కాదని అర్థమవుతోందని.. గవర్నరును లక్ష్యంగా చేసుకుని రామచంద్రయ్య విమర్శలు చేశారని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. నిజంగా చంద్రబాబునే అనాలని అనుకుంటే ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడే విమర్శలు చేసేవారని.. సీనియర్ నేత అయిన రామచంద్రయ్యకు ఎవరిని ఎప్పుడు విమర్శించారో తెలుసని.. ఆయన తాజా విమర్శలు గవర్నురుపైనే అని అంటున్నారు.