కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత సి రామచంద్రయ్య మరోమారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని ఆయన విమర్శించారు. చైనా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన బాబు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీని - రాజ్ నాథ్ సింగ్ ను కలిసినా ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రులతో చంద్రబాబు భేటీలో ప్రత్యేక హాదా అంశం చర్చకు రాలేదని టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాకు చెప్పడం చంద్రబాబు వైఖరిని చెబుతుందని చెప్పారు.
ప్రత్యేక హోదానే కాదు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యనూ చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని రామచంద్రయ్య విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అడిగిన ప్రతిసారీ ఢిల్లీ 'వెళ్లాం - కలిశాం - చెప్పాం' అంటూ మీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హైకోర్టు విభజన అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాచరిక పాలనను ఆపాలని, ప్రజా పాలన చేయాలని సి.రామచంద్రయ్య సూచించారు. కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పురాతన దేవాలయాలు - మసీదులు - ప్రార్థనా మందిరాలను ప్రజల ఆమోదం లేకుండా తొలగించడం సరికాదన్నారు. కూల్చిన వాటిని వెంటనే పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.