శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత సి రామచంద్రయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో దేవాలయాల ద్వంసం గురించి అన్ని పార్టీలు మాట్లాడుతుంటే రామచంద్రయ్య మాత్రం క్రైస్తవ ముస్లింల గురించి వ్యాఖ్యానించారు. పైగా లౌకికత్వం వంటి మాటలు చెప్పుకొచ్చారు.
కృష్ణాజిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ పాలనలో ముస్లిం - క్రిస్టియన్ మైనార్టీలు అభద్రతాభావంలో ఉన్నారని విమర్శించారు. చర్చిలు - మసీదులు ధ్వంసం చేస్తున్నారని, సెక్యులరిజం లేకుండా అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఖర్చు చేసిన రూ.1000 కోట్ల నిధులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ - బీజేపీ అధ్యక్షులు అమిత్ షా - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చారా? అని సీఆర్ ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చి వారి నుంచి కమిషన్లు తీసుకొని ఖర్చు చేసిన విషయాన్ని మర్చిపోయారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో కూల్చి వేసిన ఆలయాలపై ప్రభుత్వం మంత్రుల కమిటీని ఎందుకు ఏర్పాటు చేసిందని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి - రాష్ట్రంలో మిత్రపక్షమైన బిజెపి రోడ్డు మీదకు వచ్చి ర్యాలీలు - ధర్నాలు చేస్తుంటే టిడిపి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రంగా జయంతి కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగా లాంటి నాయకులు అరుదుగా ఉంటారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని రామచంద్రయ్య సూచించారు. ప్రపంచం అంతా స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మాత్రం గొప్పదంటున్నారన్నారు. నచ్చిన వారికి పనులు ఇవ్వడమే స్విస్ ఛాలెంజ్ విధానమని విమర్శించారు.