ఆడవాళ్లపై ఆకృత్యాలు చేయడానికి క్యాబ్ డ్రైవర్లకు బాగా అవకాశం ఉంది కాబోలు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వీళ్లు చేసిన అనేక దాష్టికాలు వెలుగులోకి రాగా.. ఈ పైత్యం చాలా రకాలుగా ఉందని తెలియజెప్పే సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రషీద్ ముస్తఫా అనే క్యాబ్ డ్రైవర్ వ్యవహారం ఇలా ఉంది.
తన క్యాబ్‌లో ఎక్కిన మహిళా ఉద్యోగి వెనుక సీటులో కూర్చొని నిద్రిస్తుండగా ఇతడు వీడియో రికార్డింగ్ చేశాడు. సెల్‌ఫోన్ ను కెమెరాగా ఏర్పాటు చేసి ఇతడు డ్రైవింగ్ చేస్తూనే ఈ పనికి ఒడిగట్టాడు. బడలికతో వెనుక సీట్లో నిద్రిస్తున్న ఆమెకు ఇదేమీ తెలియదు. అయితే తనిఖీల మీద మాదాపూర్ ప్రాంతంలో తిరుగుతున్న షీటీమ్ అధికారులు డ్రైవర్‌పై అనుమానంతో క్యాబ్‌ను ఆపారు.
అతడి వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి నిద్రిస్తున్న మహిళను వీడియో తీసి అతడు ఏం చేస్తాడనేది పోలీసులు తెలుసుకోవాల్సి ఉంది. బహుశా ఇలాంటి వీడియోలకు కూడా బయట ఏమైనా మార్కెట్ ఉందా? లేక అతడు తన పైత్యం కొద్దీ ఈ పని చేశాడా? అనే విషయాలను తేల్చాసి ఉంది.