సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో ప్రధాని మోడీ తర్వాతే ఎవరైనా. ఊహించనిరీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ప్రధానిగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అందరి నోట వినిపించే మాట.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని అయినా మోడీ తీసుకోగలరనే. ఈసారి మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సామాన్యులకు కాకుండా సెలబ్రిటీలకు షాక్ తగిలేలా ఉండటం విశేషం.
యాడ్స్ తో నటించే ప్రముఖులు.. ఇకపై వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రజల్ని మభ్యపెట్టేలా ఉండే ప్రకటనల్లో ప్రముఖులు నటించకూడదన్న రూల్‌ను తీసుకొచ్చారు. తాజాగా కొన్ని సవరణలు చేసి నూతన వినియోగదారుల సంరక్షణ బిల్లును కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
పలువురు ప్రముఖులకు.. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. తమ ఉత్పత్తులు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా తమకున్న సానుకూలతల్ని కాస్త ఎక్కువ చేసి చెప్పుకోవటం మామూలే.అయితే.. ఇకపై అలాంటి పప్పులు ఉడకవన్న విషయాన్ని మోడీ సర్కారు తేల్చేసింది.
తాజాగా ఆమోదించిన బిల్లు ప్రకారం వినియోగదారుల్ని తప్పుదారి పట్టించేలా సెలబ్రిటీలు యాడ్స్ చేయకూడదు. ఇలాంటి వాటిపై నిషేధాన్ని విదించారు. యాడ్స్ ద్వారా భారీగా లబ్థి పొందే ప్రముఖులకు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం భారీ షాకివ్వనుంది. అంతేకాదు.. వారి ఆర్థికమూలాలపైనా బలంగా దెబ్బ పడేలా ఉండటం విశేషంగా చెప్పాలి.