మమతా బెనర్జీ ఇలాకాలో బీజేపీకి ఆనందం...ఆందోళన కలగలిపి సాగుతున్నాయి. !! పార్లమెంట్ ఎన్నికలకు ముందు బెంగాల్ లో ర్యాలీలు నిర్వహించాలనుకున్న బీజేపీకి ఆ రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే ఆ మరుసటి రోజే బీజేపీకి షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ లో ఆ పార్టీ నిర్వహించాలనుకున్న ర్యాలీలకు బ్రేక్ పడింది. కలకత్తా హైకోర్టు బెంచ్ అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీజేపీ శ్రేణులు తదుపరి కార్యాచరణ గురించి సమాలోచనలు చేస్తున్నాయి.
సేవ్ డెమొక్రసీ పేరుతో వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు మూడు ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ ర్యాలీలకు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గురువారమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఇలాంటి ర్యాలీల వల్ల రాష్ట్రంలో మత హింస జరిగే అవకాశం ఉన్నదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వెంటనే సమీక్షించాలంటూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. చీఫ్ జస్టిస్ దేబశిష్ కార్ గుప్తా - జస్టిస్ షంపా సర్కార్ లతో కూడిన ధర్మాసనం.. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరగరాసింది. ఈ కేసును తిరిగి సింగిల్ జడ్జి బెంచ్ కు పంపించింది. 36 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గత తీర్పు వాస్తవాల ఆధారంగా ఇచ్చిందని కాదని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తర్వాత తమ తొలి యాత్రను శనివారం నుంచి చేపట్టాలని బీజేపీ భావించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. కలకత్తా హైకోర్టు శీతాకాల సెలవులు ప్రకటించడంతో ఇక ఈ కేసు జనవరి మొదటి వారంలోనే విచారణకు రానుంది.
కాగా, కూచ్ బెహర్ - కాక్ ద్విప్ - తారాపిత్ ప్రాంతాల్లో బీజేపీ రథయాత్ర నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నది. ఈ మూడు రథయాత్రలతో 42 లోక్ సభ నియోజకవర్గాలు కలిగిన బెంగాల్ ను బీజేపీ దాదాపు టూర్ చేస్తుంది. బీజేపీ జెండాపాతుతుందన్న భయంతోనే మమతా బెనర్జీ తమ ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వకుండే ఉండేందుకు ప్రయత్నించిందని అమిత్ షా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్ర నుంచి కనీసం 22 సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది.