ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలామంది మహిళలపై లైంగిక వేధింపులు - అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. పాఠశాలలు మొదలుకొని పనిచేసే చోటివరకు...ఇలా దాదాపుగా ప్రతి చోట మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమను ప్రేమించాలని....తమతో కలిసి తిరగాలని....కోరిక తీర్చాలని మహిళలను వేధించడం...అందుకు వారు అంగీకరించకపోతే దాడులకు తెగబడడం....కొంతమంది మృగాళ్లకు అలవాటుగా మారింది. తాజాగా, ఓ యువతి తనతో సన్నిహితంగా ఉండడం లేదన్న కారణంతో ఓ ప్రవాసభారతీయుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ యువతి బాయ్ ఫ్రెండ్ ను దారుణంగా హత్య చేసి....ఆమెకు దగ్గర కావాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాలు లెక్కబెడుతున్నాడు. పూర్తి విచారణ అనంతరం అతడికి మరణశిక్ష విధించే అవకాశముంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది.
శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో కెవిన్ ప్రసాద్ (31)...సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడు. అదే ఎయిర్ పోర్టులో పని చేస్తోన్న ఓ యువతిని డేటింగ్ కు రావాలని ప్రసాద్ పలుమార్లు కోరాడు. నగలూ నట్రా కొనిచ్చి ఆమెను వలలో వేసుకోవాలని చూశాడు. అయితే, తనకు ఆల్రెడీ మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, తమ ఇద్దరికీ మూడేళ్ల బిడ్డ కూడా ఉందని ఆమె డేటింగ్ కు నిరాకరించింది. అంతేకాకుండా, ప్రసాద్ వేధింపులు భరించలేక....తన మంగాక్కట్ తో కలిసి లాస్ ఏంజిలెస్ వెళ్లేందుకు సిద్ధమైంది. చివరి రోజు విధులకు హాజరైన ఆ యువతిని తీసుకు వెళ్లేందుకు వచ్చిన మంగాక్కట్ ను హత్య చేయాలని ప్రసాద్ ప్లాన్ వేశాడు. మంగాక్కట్ ను అడ్డు తప్పిస్తే....ఆ యువతి తనకు దక్కుతుందని భావించిన ప్రసాద్....మంగాక్కట్ ను హత్య చేసేందుకు వ్యూహ రచన చేశాడు. తలకు ముసుగు ధరించిన ప్రసాద్ తన మిత్రుడితో కలిసి....మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతడిపై 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. అదే కారులో వెనక కూర్చుని ఉన్న ఆ యువతి ముసుగులో ఉన్న ప్రసాద్ ను గుర్తించలేదు. విచారణలో భాగంగా ప్రసాద్ డేటింగ్ వ్యవహారం గురించి పోలీసులకు ఆ యువతి వివరించింది. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రసాద్ ను నిందితుడిగా గుర్తించారు. ప్రసాద్ పై తొలి డిగ్రీ మర్డర్ కేసు పెట్టి కోర్టుకు తరలించారు. విచారణ తర్వాత ప్రసాద్ కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించే అవకాశముందని పోలీసులు తెలిపారు.