ఓ వైపు దేశం మొత్తం కరోనాతో అతలాకుతలం అవుతున్న వేళ కూడా కామాంధులు మారడం లేదు. తమ బుద్ధిని పొనివ్వడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు తమ పక్కింట్లో ఉంటున్న బాలిక(9)పై లైంగికదాడికి ఒడిగట్టాడు. అయితే మరో దుర్మార్గమైన విషయం ఏమిటంటే పంచాయితీ పెట్టిన గ్రామ పెద్దలు సదరు బాలిక శీలానికి వెలకట్టారు. ఎకరం పొలం ఇప్పించేలా పంచాయితీలో తీర్మానం చేశారు. కానీ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో విషయం బయటకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలానికి చెందిన ఓ బాలిక.. తన ఇంటి ముందు ఆడుకుంటున్నది. ఆ టైంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరు. పక్కింటి వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి గ్రామ శివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.అయితే సాయంత్రం అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. దీంతో సదరు బాలిక ఏడుస్తూ కనిపించింది.
బాలికను అడగగా విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు బాలిక కుటుంబానికి ఎకరం పొలం ఇవ్వాలంటూ తీర్పు చెప్పారు. అయితే నిందితుడికి శిక్ష పడుతుందనుకున్న బాలిక తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘటనపై మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. కోర్టులు, చట్టాలు వచ్చిన ప్రస్తుత రోజుల్లోనూ కొన్ని గ్రామాల్లో పంచాయితీలు నిర్వహించి తీర్పులు చెబుతుండటం దారుణమైన విషయమని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి పంచాయితీల వల్ల బాలికలకు, స్త్రీలకు న్యాయం జరగదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.