కోవిడ్ సెకండ్ వేవ్ వేళ.. చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు దారుణమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నాయి. వైద్య సాయం అందాల్సిన వారికి.. అందని పరిస్థితి. డబ్బులు ఎంతైనా సరే.. అంటున్నా.. వైద్యం అందించేందుకు ఆసుపత్రులు సిద్ధంగా లేని పరిస్థితి. డబ్బులు అందరూ పెట్టే వారే.. కానీ.. కొందరికి మాత్రమే వైద్యం అందించే పరిస్థితి ఉంది. దీంతో.. బెడ్ దక్కించుకునే పరిచయం ఉన్న వారికి మాత్రమే ఆసుపత్రుల్లో బెడ్ లభిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో వైద్య సదుపాయాలు ఎక్కువ. ఏపీలోని చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్.. వెంటిటేలర్ బెడ్లు దొరకని పరిస్థితి. దీంతో.. రోగులు తమకున్న పరిచయాలతో హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో మాట్లాడుకొని.. అంబులెన్సుల్లో పేషెంట్లను తీసుకెళుతున్నారు. అయితే.. సోమవారం అలా వైద్యం కోసం తెలంగాణ సరిహద్దుల్లోకి వస్తున్న వారిని పోలీసులు ఆపేస్తున్నారు.
హైదరాబాద్ లో బెడ్ల కొరత ఉందని చెబుతూ వెనక్కి తిప్పి పంపుతున్నారు. అయితే.. హైదరాబాద్ లో ఆడ్మిషన్ కు అవసరమైన అంగీకర పత్రాలు ఉన్నాయని చూపించిన వారిని.. కొంత చర్చ జరిగిన తర్వాత అనుమతించారు. ఈ గందరగోళ పరిస్థితి అనూహ్యంగా తెర మీదకు రావటంతో.. ఏపీ నుంచి వచ్చిన పెద్ద ఎత్తున అంబులెన్సులు తెలంగాణలోని వివిధ సరిహద్దుల్లో నిలిచిపోయాయి. దీంతో.. ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇలాంటి కీలక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలనుకుంటే.. ముందస్తుగా ప్రకటనలు చేయాలి.
ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఆ తర్వాతే మాత్రమే ఇలాంటివి అమలు చేయాలి. నిజానికి దేశంలో ఏ ప్రాంతంలోని వారైనా.. వేరే ప్రాంతంలో వైద్య సేవలు పొందవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. ఎంతటి వైద్య సేవల కొరత ఉన్నా.. ఇలాంటి పరిమితులు అస్సలు సరికావు. ఇవాల్టి రోజున హైదరాబాద్ లో మెరుగైన పరిస్థితులు ఉండొచ్చు. రేపొద్దున అనుకోని పరిస్థితులు తెలంగాణలో ఏర్పడి.. ఏపీకి వస్తే ఆపటం ఎంత అన్యాయం అవుతుంది.
ఇలాంటి సున్నిత అంశాల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవటం ద్వారా.. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకానీ.. ఎవరు తీసుకున్నారో తెలియని నిర్ణయాన్ని.. పోలీసులు తమకున్న బలంగా నిలిపివేయటం దుర్మార్గం అవుతుంది. పాలసీలు తర్వాత.. ప్రాణం పోయేలాంటి వాటిని ఎలా అమలు చేస్తారు? అన్నది ప్రశ్న.