ఇద్దరికీ మోడీనే శత్రువు. ఇద్దరి టార్గెట్ మోడీని గద్దెదించడమే. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేజ్రీవాల్ కు మోడీ ఫ్రెండ్ అయిపోయాడు. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి సంసారం చేయాలని చూస్తున్నారు. దీన్ని బీజేపీ అడ్వంటేజ్ గా తీసుకోవాలని చూస్తోంది. మరి కేసీఆర్-కేజ్రీవాల్ ల కొత్త సంసారం దేశంలో మోడీని ఓడించగలదా? వీరికి అంత సామర్థ్యముందా?
దేశంలో మోడీ వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది. 2024లో హైట్రిక్ కొట్టడమే ధ్యేయంగా మోడీ అడుగులు పడుతున్నాయి. 2014లో మోడీ ఒక చాయ్ వాలాగా అందరివాడుగా ఫోకస్ అయ్యి అలవోకగా విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టారు. రెండోసారి ఆయనపై కొంత వ్యతిరేకత వచ్చినా బీజేపీని ఓడించే శక్తివంతమైన పార్టీ లేకపోవడంతో మరోసారి అధికారంలోకి వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆయన గట్టి పరీక్షే ఎదుర్కోవాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వకపోయినా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏకమైతే మోడీని ఓడించవచ్చని కొందరు అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీపై యుద్ధం ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మార్చి దేశంలోని మోడీ వ్యతిరేక శక్తులన్నింటిని కూడగడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో ఆయన జత కట్టడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా పేర్కొంటున్న ఆప్ తో కలిసి వెళ్తే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్ద విషయం కాదని తెలంగాణ సీఎం భావిస్తున్నారు.
అటు అవినీతి పాలన అంతం చేయడమే మా లక్ష్యమని నినదించి ఆప్ నేత కేజ్రీవాల్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. ఆయన నినాదాన్ని నిశీతంగా పరిశీలించి ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. అంతేకాకుండా విద్య విషయంలో కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయనలో నమ్మకాన్ని పెంచాయి. ఢిల్లీలో పాలనతో మెప్పించిన కేజ్రీవాల్ పంజాబ్ లోనూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన ఆప్ సీట్లు దక్కించుకోకపోయినా 13 శాతం ఓట్లను సాధించడం విశేషం. జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ అని కేసీఆర్ లాంటి నాయకులు నమ్ముతున్నారు.
తెలంగాణ వేదికగా ఇప్పటికే మోడీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఆప్ నేత కేజ్రీవాల్ తో జత కలిస్తే విజయం తథ్యం అని భావిస్తున్నారు. అందులో భాగంగా గతంలో పంజాబ్ వెళ్లి రైతు చట్టాలపై పోరాడి వీరమరణం పొందిన కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం అందించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య బలమైన మైత్రి కుదిరింది. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశారు. వీరి సమావేశం తర్వాత రాజకీయంగా తీవ్ర చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంచితే.. అవినీతిపై యుద్ధం ప్రకటించిన కేజ్రీవాల్ గతంలో తెలంగాణ వచ్చిన సందర్భంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా అవినీతి జరిగినా ఆ ప్రభుత్వంపై పోరాడుతామని ప్రకటించారు. అయితే కేసీఆర్ వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రభుత్వం చేసిన అవినీతి కనిపించలేదా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ బీఆర్ఎస్ తో జతకలిస్తే ఇంతకాలం ఆప్ పై ఉన్న నమ్మకం మసకబారుతుందని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా దీనిని అస్త్రంగా చేసుకొని బీజేపీ మరోసారి తన ప్రచారానికి వాడుకుంటే వచ్చే ఎన్నికల్లో వీరి పరిస్థితి ఏంటని అంటున్నారు.
కానీ ఆప్ ఇవేమీ ఆలోచించకుండా కేసీఆర్ తో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉన్నా మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ధ్యేయమని భావిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే కలిశారు. కానీ కేసీఆర్ గురించి తెలిసిన స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎంలల్లో కేజ్రీవాల్ మాత్రమే సపోర్టుగా ఉంటున్నారు. మిగతా వారు ప్రతిపక్షానికి చెందిన వారే.
అసలు విషయమేంటంటే తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను కేజ్రీవాల్ అంచనా వేయలేకపోతున్నారన్నది మరో వాదన. ముందు ముందు కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన తరువాత కేజ్రీవాల్ కూడా దూరం జరుగుతారని అంటున్నారు.. అయితే ఇది వచ్చే ఎన్నికల్లోపు బయటపడడం ఖాయమంటున్నారు.. ఆలోపు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.
అయితే ప్రస్తుతమున్న బలం దృష్ట్యా మోడీని ఓడించడం అంత ఈజీ కాదు.. కేజ్రీవాల్ కు, కేసీఆర్ దేశమంతా అంతటి బలం లేదు.. కొన్ని రాష్ట్రాల్లో తప్పితే మిగతా రాష్ట్రాల్లో వీరిద్దరి ప్రభావం శూన్యం. కలిసి సాగితే సగం రాష్ట్రాల్లో ప్రభావం చూపొచ్చు. రైతు ఎజెండా.. అవినీతి రహిత పాలనతో కొన్ని సీట్లు గెలవచ్చు కానీ మోడీని ఓడించే స్థాయి లేదని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.