మనం కళ్లతో చూస్తున్నదే నిజం అనుకుంటాం. కనిపించేదే వాస్తవం అనుకుంటాం. కానీ, కళ్లను కూడా మోసం చేసేవి కొన్ని ఉంటాయి! అలాంటిదే ఈ పజిల్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది కళ్లకు పరీక్ష పెడుతోంది. చూపులకు సవాలు విసురుతూ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో ఏముందంటే... చాలా సింపులండీ - ఇదో మెష్ మాదిరిగా ఉన్న ఒక పజిల్. మనం అప్పుడప్పుడూ ఆప్టికల్ ఇల్యూజన్స్ జిఫ్ ఇమేజ్ లు ఇంటర్నెట్ లో చూస్తుంటామే, ఇదీ అలాంటిదే. కాకపోతే ఇది జిఫ్ కాదు.. మామూలు పజిల్. దీన్ని జాక్వెస్ నినియో - కెంట్ ఎ స్టీవెన్స్ కలిసి తయారుచేశారు. దీన్లో 12 నల్లని చుక్కలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఆ నల్లని డాట్స్ ఎక్కడున్నాయో అనేది తొలి చూపులోనే కనిపెట్టడమే సవాల్. వాటిని వెతికి పట్టుకోవడమే పజిల్. వాటిని ఒకే రౌండ్ లో లెక్కపెట్టెయ్యడమే ప్రశ్న!
ఈ ఇల్యూజన్ తొలిసారిగా తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్ట్ చేశారు అకియోషీ కిటావొకా అనే ఒక సైకాలజీ ప్రొఫెసర్. దీన్ని ఈ నెల సెప్టెంబర్ 11న తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అంతే, రోజులు గడుస్తున్న కొద్దీ ఇది వైరల్ అవుతోంది. అకియోషీ పెట్టిన పోస్టును ఇంతవరకూ దాదాపు 23,000 మందికిపైగా షేర్ చేశారు. ఈ చిత్రాన్ని డౌన్ లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఇంకెంతమందో తెలీదు! సెప్టెంబర్ 12న ఈ ఇమేజ్ ట్విట్టర్లోకి వచ్చింది. దాదాపు 34,000 రీట్వీట్లు దాటేశాయి. ఇక లైకులంటారా... అవో 32,400ల పైచిలుకు వచ్చాయి. ఇంకా ఇది వైరల్ అవుతూనే ఉంది.
ఈ ఇల్యూజన్‌లోని 12 చుక్కలు చాలామందికి చుక్కలు చూపిస్తున్నాయి. 12 ఉన్నట్టుగానే అనిపిస్తాయి, కానీ లెక్కించడం మొదలు పెడితే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. తొలిసారి కౌంటింగ్ చేస్తున్నప్పుడు 12 చుక్కలూ మీకు కనిపించేశాయంటే గ్రేట్.. మీరు గెలిచినట్టే. మొత్తానికి దీంతో చాలామంది కుస్తీలు పడుతున్నారు. కాస్త ఓపిక ఉంటే ఆ 12 చుక్కల్నీ మీరూ ఓ చూపు చూడండి!