పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించటానికి ముందు అసలేం జరిగిందన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చేందుకు సమాచార హక్కు కార్యకర్తలు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. ఏదో రకంగా.. పెద్దనోట్ల నిర్ణయం వెనుక ఏం జరిగిందన్న విషయాన్ని అధికారిక సమాచారంతో బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారెన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎలాంటి ఫలితం దక్కని పరిస్థితి.
ఇప్పటికే ప్రధాని కార్యాలయం.. రిజర్వ్ బ్యాంకుల్ని పదే పదే ప్రశ్నించిన ఆర్టీఐ కార్యకర్తలు.. ఇప్పుడు తమ గురిని ఆర్థిక శాఖపై పెట్టారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి ముందుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని సంప్రదించారా? లేదా? అన్న విషయంపై సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ.. ఆర్థిక శాఖకు ఒక అభ్యర్థనను పెట్టారు. దీన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ.. తాము సమాధానం చెప్పలేమనితేల్చేసింది.
ఆర్థిక మంత్రి.. ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు ద్వారా తెలుసుకునే ఈ అంశం ఓ సెక్షన్ ప్రకారం ఆర్టీఐ పరిధిలోకి రాదని వివరణ ఇవ్వటంతోపాటు.. దేశ సమగ్రత.. భద్రత.. వ్యూహాత్మక అంశాలతో పాటు విదేశాంగ విధానాలకు సంబంధించిన అంశాలపైతాము సమాధానాన్ని ఇవ్వలేమని పేర్కొంది. సమాధానాన్ని చెప్పేందుకు నో చెప్పిన ఆర్థిక శాఖ.. ఏ సెక్షన్ కింద తాము సమాచారాన్ని ఇవ్వటాన్ని నిరాకరించామన్న విషయాన్ని చెప్పేందుకు మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధానితో పాటు.. ఈ వ్యవహారంలో ఏ నేతలు ఉన్నారన్న విషయంపై ఎలాంటి సమాచారం రాని నేపథ్యంలో.. ఆ అంశాల్ని తెలుసుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆర్థిక శాఖకు ఆర్టీఐ లేఖాస్త్రాన్ని సంధించినట్లుగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/