బ్రిటన్ పార్లమెంట్ వద్ద కలకలం చోటుచేసుకుంది. ఆ దేశ భవనంపై దాడికి ఉగ్రవాదులు మరోసారి విఫలయత్నం చేశారు. గత ఏడాది మార్చిలో ఖలీద్ మసూద్ అనే ఉగ్రవాది బ్రిటన్ పార్లమెంట్ పైకి దూసుకొచ్చి ఐదుగురిని హతమార్చిన సంగతి తెలిసిందే. తొలుత వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జిపై తన వాహనంతో ఢీకొట్టి నలుగురిని హతమార్చిన దుండగుడు ఆ తరువాత పార్లమెంట్ ఆవరణలో ఓ పోలీసును కత్తితో పొడిచి చంపాడు. అయితే పోలీసులు వెంటనే ఆ ఉగ్రవాదిని కాల్చివేశారు. సరిగ్గా అదే రీతిలో రద్దీ సమయంలో ఓ ఆగంతకుడు తన కారుతో పార్లమెంట్ భవనం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన అతని కారు పలువురు పాదచారుల ను ఢీకొడుతూ అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీ కొని ఆగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెంటనే ఆ కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.37 గంటలకు జరిగిన ఈ ఘటనను టెర్రరిస్టుల చర్యగానే భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బ్రిటన్ మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ నీల్ బసు ఈ ఘటనపై స్పందిస్తూ... ఆ కారు పార్లమెంట్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటనను ఉగ్రవాద దాడిగానే పరిగణిస్తున్నామని తెలిపారు. నిందితుడిని ప్రశ్నిస్తున్నామని అయితే అతడు తమకు సహకరించడం లేదని వివరించారు. ముందు నిందితుడు ఎవరో గుర్తించిన తరువాత ఈ దాడి వెనుక లక్ష్యమేమిటో కనుగొంటామన్నారు. నిందితుడి గురించి తమ నిఘా వర్గాల వద్ద కూడా ఏ సమాచారం లేదన్నారు. లండన్ వాసులకు లేదా బ్రిటన్ అంతటికీ మరింత ముప్పు ఉన్నట్టు నిఘా వర్గాలు ఎటువంటి హెచ్చరికలు చేయలేదని బసు అన్నారు. ఘటన తీరును బట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా కనిపిస్తున్నదని అన్నారు.ఇదిలాఉండగా....సంఘటనపై స్పందించిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరిస్థితి అదుపు తప్పకుండా నిరోధించిన ఎమర్జెన్సీ సేవల సిబ్బందిని ఆమె ప్రశంసించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగడం లేదని, వందల సంఖ్యలో సిబ్బంది లోపల ఉన్నారని అధికారులు చెప్పారు.