దుర్గ‌మ్మ విగ్ర‌హ నిమ‌జ్జ‌నంలో భ‌క్తుల‌పై దూసుకువెళ్లిన కారు..( వీడియో)

Update: 2021-10-16 09:03 GMT
దేశ‌వ్యాప్తంగా దుర్గ‌మ్మ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఎక్క‌డ చూసినా దుర్గ‌మ్మ నామ‌స్మ‌ర‌ణ మార్మోగుతోంది. ఇక దుర్గాదేవిని న‌వ‌రాత్రులు పూజించి నిమ‌జ్జ‌నం చేసేందుకు వెళుతోన్న ఊరేగింపుపై ఓ కారు దూసుకు వెళ్ల‌డంతో దారుణం జ‌రిగింది. ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో జ‌రిగిన ఈ ఘోర సంఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా, 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. చత్తీస్‌గఢ్‌లోని జాస్పూర్ జిల్లా పాతల్‌గావ్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

ఇక క్ష‌త‌గాత్రుల్లో ఇద్ద‌రు ఎముక‌లు విరిగిపోయాయి. దీంతో వారిని ఇత‌ర ఆసుప‌త్రుల‌కు రిఫ‌ర్ చేసిన‌ట్టు వైద్యులు చెప్పారు. ఊరేగింపు సంద‌ర్భంగా వెళుతోన్న బృందంను చూసి కూడా కారు ఆ బృందాన్ని గుద్దుకుని మ‌రీ ముందుకు వెళ్లింది. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ హాహాకారాలు మిన్నంటాయి. ఆగ్ర‌హంతో ఊగిపోయిన స్థానికులు ప‌లు వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డంతో పాటు జ‌నంపైకి దూసుకు వెళ్లిన కారు డ్రైవ‌ర్‌ను ప‌ట్టుకుని చిత‌క‌బాదుడు బాదారు.

వాళ్లంతా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి నిర‌స‌న‌కు దిగ‌డంతో పాటు ఆ కారులో గంజాయి పెద్ద ఎత్తున ఉంద‌ని ఆరోపించారు. ఇక ఈ కారులో ఉన్న వారిలో బబ్లూ విశ్వకర్మ (21), శిశుపాల్ సాహు (26)లు అని తేలింది. పోలీసుల విచార‌ణ‌లో వీరిది మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాగా... వీరు ఛ‌త్తీస్‌ఘ‌డ్ మీదుగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు వెళుతుండ‌గా.. ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై ఛ‌త్త‌స్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రి భూపేస్ బఘేల్ స్పందించారు.

దుర్గ‌మ్మ భక్త బృందంను కారు ఢీకొన‌డం దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న అన్నారు. నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేశామ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు పూర్తి న్యాయం చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న నిందితులు ఎంత‌టి వారు అయినా వ‌దిలేది లేద‌ని ట్వీట్ చేశారు. అలాగే ఇక్క‌డ నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రించిన పోలీసుల‌పై సైతం చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.



Full View




Tags:    

Similar News