హరికృష్ణ ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్త తెలుగు ప్రజలను శోకసంద్రంలో ముంచివేసింది. నెల్లూరు జిల్లాలోని కావలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు హరికృష్ణ.. తన మిత్రులు అరికెపూడి శివాజీ - వెంకట్రావ్ లతో కలిసి ఈ ఉదయం 4.30 గంటలకు బయలు దేరారు. హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తూ నల్గొండ జిల్లా నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం హరికృష్ణ కుమారుడు జానకీ రామ్ కూడా కారు నడుపుతూనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. వీరిద్దరి మరణంలోనూ ఓ సామీప్యత ఉంది. ఇద్దరూ హైదరాబాద్-విజయవాడ రహదారిపైనే మరణించడం.. అదీ నల్గొండ జిల్లాలోనే కావడం గమనార్హం.
అయితే అది యాదృశ్చికమో.. లేక సెంటిమెంటో తెలియదు కానీ.. హరికృష్ణ - జానకీరామ్ లు వాడిన రెండు కార్ల నంబర్లు ఒక్కటే కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. వాహనాలు వేరు అయినా వారి వాహనాల నంబర్లు మాత్రం 2323తోనే ఉండడం అందరినీ నివ్వెరపరిచాయి. హరికృష్ణ నడుపుతున్న కారు నంబర్ AP 28 BW 2323 కాగా.. జానకీరామ్ నడిపిన కారు నంబర్ AP 29BD 2323. నాలుగేళ్ల కిందట జానకీ రామ్ ప్రమాదానికి కారణమైన కారు.. ఇప్పుడు హరికృష్ణ యాక్సిడెంట్ కు గురైన కారు నంబర్ ఒక్కటే కావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది విధిరాతో.. లేక రాసిపెట్టి ఉందో అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.