న‌గ‌ర రోడ్ల‌పై 70కి.మీ. స్పీడ్ తో దూసుకెళ్లొచ్చ‌ట‌

Update: 2018-03-15 06:31 GMT
కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో రోడ్ల నాణ్య‌త మీద అవ‌గాహ‌న ఉందో లేదో కానీ.. ఇక‌పై న‌గ‌ర రోడ్ల మీద వాహ‌న క‌నీస వేగ ప‌రిమితిని గంట‌కు 70కిలోమీట‌ర్లుగా పెంచుతూ నిర్ణ‌యాన్ని తీసుకొని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇప్పుడున్న రోడ్ల‌కు గంట‌కు యాభై కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తేనే ప్ర‌మాదాలు జ‌రిగే ప‌రిస్థితి ఉంది.

ర‌హ‌దారుల మ‌ధ్య‌లో గుంట‌లు.. ఎగుడుదిగుడు.. కొన్నిచోట్ల ఇసుక‌.. కంక‌ర‌తో ఉండ‌టం.. మెలిక‌లు తిరిగేలా ఉన్న రోడ్ల‌తో పాటు.. మ్యాన్ హోల్స్ మూత‌లు ఏర్పాటు చేసిన తీరు స‌రిగా లేక‌పోవ‌టంతో ప్ర‌మాదాల‌కుఅవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

టూ వీల‌ర్ ప్ర‌యాణికుల వాహ‌నాలు ఎక్క‌డ ఎప్పుడు స్కిడ్ అవుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. దేశ వ్యాప్తంగా వాహ‌న వేగాల‌కు సంబంధించి తాజాగా వెల్ల‌డించిన వేగం మ‌రిన్నిప్ర‌మాదాల‌కు కార‌ణం అయ్యే అవ‌కాశం ఉందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. కేంద్రం జారీ చేసిన తాజా ఉత్త‌ర్వులు చూస్తే.. కార్లు లాంటి వాహ‌నాలు గంట‌కు 70 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే వీలు ఉంటే.. కార్గో వాహ‌నాలు గంట‌కు 60 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించేందుకు అనుమ‌తిని ఇచ్చారు.

ఇక‌.. టూవీల‌ర్ ప్ర‌యాణికులు గంట‌కు 50 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే..కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం ఏమిటంటే.. తాము జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ఆయా రాష్ట్రాలు త‌మ త‌మ రోడ్ల భ‌ద్ర‌త‌కు సంబంధించి వాహ‌న వేగానికి సంబంధించి ప‌రిమితులు విధించుకునే వెసులుబాటును క‌ల్పించింది.

ప్ర‌స్తుతం న‌గ‌రాల్లో వాహ‌నాల వేగ ప‌రిమితి గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్లు మాత్ర‌మే ఉంది. న‌గ‌రాల్లో రింగు రోడ్లు.. ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్ట‌టంతో వాహ‌నాల వేగం పెంచుతున్న‌ట్లుగా వెల్ల‌డించింది. అదే స‌మ‌యంలో ఎక్స్ ప్రెస్ హైవేల‌పైకార్లు గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లేందుకు తాము అనుమ‌తిని ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాహ‌నాల్ని వేగంగా న‌డ‌ప‌టం కార‌ణంగా ఒక్క 2016లొనే 74వేల మంది యాక్సిడెంట్ల‌కు గురై మ‌ర‌ణించారు. తాజా.. పెంచిన వాహ‌న వేగంతో రోడ్ల ప్ర‌మాదాలు మ‌రింత‌గా పెరిగే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వాహ‌న వేగాన్ని పెంచేందుకు ఆస‌క్తి చూపిస్తున్న కేంద్ర స‌ర్కారు జీవ‌న ప్ర‌మాణాల్ని పెంచే అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
Tags:    

Similar News