అక్బరుద్దీన్‌ ఓవైసీ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్ !

Update: 2019-12-13 08:54 GMT
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ హైకోర్ట్  షాక్ ఇచ్చింది.  నిజామాబాద్‌లో ఓ వర్గం ప్రజలను ఉద్దేశిస్తూ.. 2012లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆ వ్యాఖ్యలపై  అక్బరుద్దీన్‌ పై కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ కూడా చేసారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయన ఇటీవల మరోసారి ఓ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

దీనిపై  హిందూ సంఘటన్ అధ్యక్షుడు,న్యాయవాది కరుణసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణ అనంతరం అక్బరుద్దీన్ సహా సీబీసీఐడీ పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన అక్బరుద్దీన్ తీరు మార్చుకోకపోగా.. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పిల్‌లో కరుణ సాగర్  పొందుపరిచారు. దీని పై విచారణ జరిపిన  కోర్ట్..అక్బరుద్దీన్‌ ఓవైసీ తో పాటు..CBCID పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇకపోతే రెండు రోజుల క్రితం కూడా అక్బరుద్దీన్ ఇదే కేసు విచారణ నిమిత్తం నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు.
Tags:    

Similar News