మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడవిట్ లో వెల్లడించలేదని - ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని పేర్కొంటూ చంద్రబాబు చేతిలో ఓటమి పాలైన వైసీపీ నేత చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ గా పనిచేసిన ఏఎస్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు. సమాదానం చెప్పాలంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఆదాయ మార్గాల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యత పాటించారని.. ప్రభుత్వ నిధుల నుంచి ముఖ్యమంత్రిగా జీతం తీసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు అఫిడవిట్లో చెప్పలేదని విద్యాసాగర్ తన పిటిషన్లో ఆరరోపించారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకే చెందిన కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో వంశీ సూచన మేరకు ఆయన ప్రతినిధులు ఇంటి స్థలాల నకిలీ పట్టాలను పంచి ప్రలోభ పెట్టారని తెలిపారు. లెక్కింపు కూడా చట్ట విరుద్ధంగా జరగడంతో తాను 990 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని ఆయన ఆరోపించారు. ఇంతకుముందు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు సైతం హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ఓటమి పాలైన వైఎస్ ఆర్సీపీ అభ్యర్థి సీహెచ్ ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ వేశారు. గిరిదర్ బ్యాంకు రుణాల ఎగవేశారని... అందుకే ఆయన ఎన్నిక రద్దు చేయాలని ఆ పిటిషన్లో ఏసురత్నం కోరారు.
మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై ఎన్నికపై ఇప్పుడు హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.