ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో కేసు నమోదైంది. తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. భీమవరం సభలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలపై దారుణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణలో ఆంధ్ర ప్రజలపై దాడులు చేస్తున్నారని.. ఆస్తులు కొల్లగొడుతున్నారని.. అది పాకిస్తానా అంటూ తీవ్ర విమర్శించాడు.. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతల ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ పై తెలంగాణలోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
తెలంగాణలోని 28 రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలోనూ ఎవ్వరిపై దాడులు చేయలేదని.. అందరూ సఖ్యతగా ఉంటున్న వేళ పవన్ కళ్యాణ్ ఇలా విద్వేశాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయవద్దని హితవు పలికారు.
పవన్ కళ్యాన్ తన రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ప్రోద్బలంతో తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడుతున్నారని.. ఇరురాష్ట్రాల ప్రజల మధ్య పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.