హైకోర్టు శిక్ష.. కోతులకా? జీహెచ్ఎంసీకా?

Update: 2019-08-18 06:18 GMT
ఎడాపెడా  చెట్లు కొట్టేస్తున్నాం.. గ్రానైట్ పేరుతో కొండలు కరిగించేస్తున్నాం.. అడవులను నరికేస్తున్నాం. దీంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలపై పడుతున్నాయి. విచ్చలవిడిగా చెట్ల హననానికి మనిషికి పడుతున్న శిక్ష ఇదీ..

ఇప్పుడు కోతులు పల్లెలు, పట్నాలకే కాదు.. ఏకంగా హైదరాబాద్ కు కూడా వచ్చేశాయి. తాజాగా హైదరాబాద్ పద్మారావునగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లోకి కోతులు ప్రవేశించి ఆహార పదార్థాలను లూటీ చేయడంతోపాటు అడ్డువచ్చిన మహిళలు, చిన్నపిల్లలపై దాడులు కూడా చేశాయి.

అయితే దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. కోతులను పట్టుకోవడం ఈజీనా.. అవి గెంతుతూ పారిపోతాయి.. వాటిని నియంత్రించడం జీహెచ్ఎంసీకే కాదు ఎవ్వరికీ సాధ్యం కాదు.. అడవులను నాశనం చేసి పండ్ల చెట్లను ధ్వంసం చేయడంతో అనివార్యంగా ఇలా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కోతులు ఇళ్లమీద పడుతున్నాయి.

అయితే కోతుల నుంచి రక్షణకు అపార్టుమెంట్లకు జాలీలు, గ్రిల్స్ ఏర్పాటు చేసుకుందామంటే జీహెచ్ఎంసీ నిబంధనల పేరిట ఆంక్షలు విధిస్తోందట.. మరీ కోతులను ఏమో నియంత్రించలేకపోతోంది. అందుకే ఈ ఇష్యూ పెద్దదై ఇప్పుడు హైకోర్టు బెంచ్ కు చేరింది.

ఎన్నో విపత్కర కేసులను చూసిన హైకోర్టు జడ్జిలు  తాజాగా ఈ కోతులపై ప్రజాప్రయోజనవ్యాజ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నివేధించాలని రిజిస్ట్రీని కోరారట.. నేరం చేసిన కోతులపై శిక్ష వేయడం సాధ్యం కాదు.. నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీకి వేద్దామంటే కోతులను పట్టుకొని వేధించడం జంతు పరిరక్షణ కింద నేరం.. ప్రత్యామ్మాయ చర్యలు చేపట్టినా కోతులను నియంత్రించడం సాధ్యం కాని పని.. మరి ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఏకంగా సమస్య హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. మరీ హైకోర్టు సీజే దీనిపై ఎలాంటి తీర్పునిస్తారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News