ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాంతంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ గంజ్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు బైసీలో అనుమతి లేకుండా ఎన్నికల సభ పెట్టారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అసద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన అసదుద్దీన్ ఫేస్ బుక్ పెట్టిన పోస్టింగ్ లపైనా కేసు నమోదైంది. తన ఇమేజ్ ను దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథన్ కేసు పెట్టారు. బిహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే తన లక్ష్యమని చెప్పిన అసదుద్దీన్ అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.తర్వాత ఆయనను బెయిల్ పై విడుదల చేశారు.