అనిల్ బొకిల్....2016 నవంబర్ 8వ తేదీ వరకు ఈ పేరు కొందరికే తెలుసు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అర్థకాంత్రి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ గురించి అనేక మందికి తెలిసింది. నోట్ల రద్దును ప్రతిపాదించిన వ్యక్తిగా ఆయన సుపరిచితుడు అయ్యారు. పెద్ద నోట్లరద్దు ఒకటి. ఈ నిర్ణయాన్ని ప్రకటించి నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అనిల్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. తాము కోరిన విధంగా నోట్ల రద్దు జరుగలేదని - నల్లధన మూలాలను దెబ్బకొట్టాలని - పన్ను విధానాన్ని సంస్కరించాలని ప్రతిపాదించామని అనిల్ బొకిల్ చెప్పారు. తాము తెలిపిన ఐదుపాయింట్లను అమలు చేస్తేనే నల్లధన నిర్మూలన సాధ్యమవుతుందని, ప్రస్తుతం ఉన్న అన్ని రకాల పన్నులను రద్దుచేసి బ్యాంకు లావాదేవీల పన్ను (బీటీటీ) అనే ఒకే పన్నును అమలు చేయాలని అనిల్ సూచించారు. తమ కోణంలో డిమానిటైజేషన్ ప్రక్రియ పూర్తికాలేదని - కేవలం నోట్ల ఉపసంహరణ మాత్రమే జరిగిందన్నారు. తాము పన్ను రహిత-పరిమిత నగదు విధానాన్ని ప్రతిపాదించామని చెప్పారు. తాము కోరిన విధంగా నోట్ల రద్దు జరుగలేదని - నల్లధన మూలాలను దెబ్బకొట్టాలని ప్రతిపాదించినట్టు చెప్పారు.
మన కరెన్సీలో పెద్దనోట్లు దాదాపు 85 శాతం వరకు ఉన్నాయని - ఇంతమొత్తంలో పెద్దనోట్లు ఉండటంతో డబ్బు లావాదేవీలు జరపడం సులభతరమైందని, దీంతో అవినీతి - నల్లధనం - నకిలీనోట్ల పెరుగుదల - సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు - జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని అనిల్ బోకిల్ తెలిపారు. సమాంతర ఆర్థిక వ్యవస్థవల్ల రైతులు - వ్యాపారులు పెద్దఎత్తున నష్టపోతున్నారని, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వానికి నోట్లను రద్దు చేయడం తప్పనిసరి అయ్యిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ఆర్బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం...గతంలో రూ.500 - 1000 నోట్లు మొత్తం కరెన్సీలో 85శాతం ఉండగా...నోట్ల రద్దు తర్వాత విడుదల చేసిన కొత్త రూ.500 - 2000 నోట్లు 72శాతం ఉన్నట్టుగా పేర్కొంది. గతంలో రూ.16.6లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు 13.3లక్షల కోట్లు ఉంది. నోట్లరద్దు అనేది కేవలం ప్రారంభం మాత్రమే.. ఇది అర్థికవ్యవస్థ సమతౌల్యానికి ఉపకరిస్తుంది అని అనిల్ పేర్కొన్నారు. నోట్లరద్దు వల్ల నకిలీనోట్ల చలామణి తగ్గిపోయిందని, దీంతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
ఈ సందర్భంగా మరిన్ని అంశాలను బోకిల్ వివరిస్తూ...పన్ను వసూళ్లు పెరిగాయని, భూముల ధరల పెరుగుదలకు కట్టడి పడిందని పేర్కొన్నారు. మూలధన విలువ - వడ్డీరేట్లు తగ్గడంతో వ్యాపారులకు తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తాయని - దీంతో ఉపాధి పెరుగుతాయన్నారు. డిజిటల్ లావాదేవీల వల్ల పారదర్శకత - జవాబుదారీతనం పెరుగుతుందని వివరించారు. గతంలో ఉన్న పరోక్ష పన్నులతో పోల్చితే జీఎస్టీ ఉత్తమమైనదని - కానీ రాజకీయ ప్రభావం లేకుండా రూపొందించిన బీటీటీ మరింత ప్రయోజనకరమైనదని తెలిపారు. తాము చెప్పిన అయిదు ప్రతిపాదనలు అమలు చేయాలని - అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరుగాలని - రూ.50కంటే ఎక్కువ విలువైన నోట్లను రద్దుచేయాలని - రూ.2వేల కంటే ఎక్కువగా జరిగే నగదు లావాదేవీలను నియంత్రించాలని సూచించారు.