కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న చంద్రబాబు తాజాగా మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి చుక్కలు చూపించారు. కేంద్ర ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేయడం.. దానిపై సీబీఐ విచారణకు అనుమతి కోరినా ఇవ్వకుండా కక్ష సాధించారు. అంతటితో వదలకుండా తన చెప్పుచేతుల్లోనే ఏసీబీని పురమాయించి సదురు కేంద్ర అధికారిపై కేసు నమోదు చేయించారు.. దీంతో సీబీఐ భగ్గుమంది. తమ అధికారాలను కల్లెం వేసి ఏసీబీ చేత కేసు పెట్టించడం.. సమాచారాన్ని లీక్ చేయడంపై ప్రకటనలో తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వివాదం ఇప్పుడు కేంద్రం వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని కేంద్ర సీజీఎస్టీ రేంజ్ అధికారి ముక్కు కాళీ రమణేశ్వర్ పై లంచం తీసుకున్న కేసులో విచారించేందుకు తాజాగా సీబీఐ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. విశాఖ నుంచి సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని సచివాలయంలో వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాన్ని లీక్ చేయవద్దని.. తాము విచారిస్తామని.. అనుమతి ఇవ్వాలని కోరారు.
అయితే సీబీఐ విన్నపాన్ని ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ సమాచారాన్ని ఏసీబీకి లీక్ చేసింది. ప్రభుత్వం ప్రోత్సాహంతో ఏసీబీ దూకుడుగా ముందుకెళ్లింది. నిబంధనలు ఉల్లంఘించి రమణేశ్వర్ పై కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు సీబీఐ, ఏసీబీ వార్ ఏపీలో దుమారం రేపుతోంది. తమకు దర్యాప్తు చేయడానికి సహకరించకుండా ఏసీబీని ఏపీ ప్రభుత్వం రంగంలోకి దింపడంపై సీబీఐ ఒక ప్రకటనలో తీవ్రంగా తప్పుపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. తమ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని.. ఈ విషయంలో వెనక్కి తగ్గమని గట్టిగా బదులిచ్చింది. దీంతో కేంద్రం రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వంపై పోరాడుతుందా ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.