తమిళనాడులో ఇసుక క్వారీలు - ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించుకుండా నెట్టుకొచ్చిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో పడిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో 170 కోట్ల రూపాయల నగదు - రూ. 130 కేజీల బంగారం ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ సంఘటన జరిగినప్పటి నుంచి ఐటీ అధికారులు శేఖర్ రెడ్డిని - ఆయన బంధువులను విచారిస్తున్నారు. ఇదే క్రమంలో చెన్నై చేరుకున్న సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు శేఖర్ రెడ్డిని విచారించి వివరాలు సేకరించిన అనంతరం అరెస్ట్ చేశారు. అయితే శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఎవరిని ఇది షాకింగ్ న్యూస్ అనే ప్రశ్నలు, వాటి తాలూకు కథనాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.
శేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చెయ్యడంతో అన్నాడీఎంకే నాయకులు హడలిపోతున్నారని, శేఖర్ రెడ్డి అన్నాడీఎంకే నాయకులతో సన్నిహితంగా ఉండటమే దీనికి కారణం అని అలాగే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు శేఖర్ రెడ్డి సన్నిహితుడనే ముద్ర కూడా ఉందని అంటున్నారు. దీంతో శేఖర్ రెడ్డి అరెస్టు అనంతరం పన్నీర్ సెల్వం అనుచరులు ఆందోళన చెందుతున్నారట. ఈ సంగతులు అలా ఉంటే... శేఖర్ రెడ్డి కారణంగా తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు కూడా కష్టాలు కొని తెచ్చుకున్నాడని అంటున్నారు.
ఇదే క్రమంలో బుధవారం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు కు సమన్లు జారీ చేసిన ఐటీ అధికారులు ఒక్క నిమిషయం కూడా సమయం ఇవ్వకుండా ఆయన ఇంటిలో సోదాలు చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ - చిత్తూరులో కూడా సుమారు 44 కేజీల బంగారం - రూ. 26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యగా చెన్నై నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఏకంగా కేంద్ర ప్రభుత్వం పారామిలటరీ బలగాలను మొహరించింది. ఇలా రామ్మోహన్ రావు దెబ్బతో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఉలిక్కిపడింది. ప్రభుత్వానికి చెందిన సెక్రటేరియట్ లో ఇంత వరకు ఐటీ అధికారులు దాడులు చేసినట్లు చరిత్రలోనే లేదని ప్రతిపక్ష పార్టీలు మరోవైపు నుంచి విమర్శలు మొదలుపెట్టేశాయి.
కాగా... ఐటీ అధికారులు సెక్రటేరియట్ కు వెళ్లిన సమయంలో కొందరు మంత్రులు మాత్రమే అక్కడ ఉన్నారని, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం అక్కడ లేరని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/