జగన్ హాజరు పై సీబీఐ కోర్టు ఆదేశాలు

Update: 2020-01-25 02:22 GMT
ఏపీ సీఎం జగన్ చాలా బిజీగా ఉన్నారు. ఏపీలో అమరావతి మార్పు, 3 రాజధానులపై అసెంబ్లీ సమావేశాలు సహా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఒక రాష్ట్రానికి సీఎం కావడం.. బాధ్యతలు ఉండడంతో తీరికలేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరులో మినహాయింపు ఇవ్వాలని తాజాగా ఆయన తరుఫు న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు.

అయితే సీబీఐ న్యాయమూర్తి జగన్ తరుఫు న్యాయవాదుల ప్రతిపాదన ను తిరస్కరించారు. ప్రతీవారం సీఎం బీజీగా ఉన్నారన్న కారణం సహేతుకం కాదని.. ఈనెల 31 కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మరో ఉదాహరణ ను కూడా సీబీఐ న్యాయమూర్తి చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ పై అవినీతి నిరోధక చట్టం కింద విచారించేందుకు కేంద్రం అనుమతిచిందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తో సంబంధం లేదని స్పష్టం చేశారు.

సీబీఐ నమోదు చేసిన కేసుల్లో జగన్ కోర్టుకు హాజరు కావాలని కోరింది. శుక్రవారం కీలక సమావేశంలో పాల్గొనాలి ఉందని.. ఆయన గైర్హాజరుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ తరుఫు న్యాయ వాదులు వేసిన పిటీషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈడీ కేసులోనూ జగన్ హాజరు కావాలని సీబీఐ కోర్టు పేర్కొన్నట్టు తెలిసింది.

నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పై, సోనియా నిర్ణయానికి వ్యతిరేకం గా విభేదించి ఓదార్పు యాత్ర చేసిన జగన్ కాంగ్రెస్ సర్కారు ఈ కేసులు పెట్టి ఇరికించిందన్న అపవాదు ఉంది. వైఎస్ ఉన్నప్పుడు లేని కేసులు.. ఆయన మరణం తర్వాత జగన్ పై మోపారు. ఇప్పుడు అవే కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.
Tags:    

Similar News