సీబీఐకి చుక్క‌లు చూపిస్తున్న శేఖ‌ర్ రెడ్డి

Update: 2016-12-18 17:30 GMT
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు - కోట్లకు కోట్ల కొత్త నోట్ల కట్టల కేసులో దొరికిపోయిన పారిశ్రామికవేత్త జే శేఖర్‌ రెడ్డి కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నారు. శేఖర్‌ రెడ్డి నివాసాలపై ఇటీవల జరిపిన దాడుల్లో రూ.33.75కోట్ల మేర కొత్త కరెన్సీ లభించడం తెలిసిందే. నేరుగా ముద్రణశాల నుంచి వచ్చిన మాదిరే కనిపిస్తున్న ఆ నోట్లు ఏ బ్యాంకు బ్రాంచి నుంచి అందినవో తెలుసుకునే పనిలో పడింది. అయితే సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలు బిత్తరపోయేలా శేఖర్ రెడ్డి ముందస్తు వ్యూహం సిద్ధం చేసి పెట్టేశాడు!

ఒకవేళ తన అక్రమ నిల్వలపై దర్యాప్తు కొనసాగే పక్షంలో ఆదాయపు పన్ను - ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) - సీబీఐ వంటివి ఆ నోట్లు ఏ బ్యాంకు - ఏ బ్రాంచి నుంచి వచ్చినవో తెలుసుకోకుండా నిరోధించేందుకు నోట్లను వరుస సంఖ్యలో లేకుండా కలిపేశాడు. దీంతో సీబీఐ అధికారులు క్రమ సంఖ్యలో అమర్చిలేని ఆ నోట్ల వెంట కుస్తీప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ విష‌యం తెగ‌క‌పోవ‌డంతో  స‌ద‌రు ప‌ట్టుబ‌డ్డ నోట్ల సీరియల్ నంబర్లను కంప్యూటర్ ఎక్సెల్ షీట్లలో పొందుపరిచేందుకు సీబీఐ దాదాపు వంద మందిని ఏర్పాటు చేసుకుంది. ఈ వివ‌రాల‌ను కంప్యూట‌రీక‌రించిన త‌ర్వాత ఆర్బీఐని సంప్ర‌దించి ఆయా నోట్ల నంబ‌ర్ల ఆధారంగా ఏయే బ్రాంచీవో వెల్ల‌డిస్తామ‌ని అధికారులు అంటున్నారు.

ఇదిలాఉండ‌గా...త్వరలో కొత్త రూ. 500 నోట్లను ఈ సిరీస్‌ తో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్ర‌క‌టించింది. నోటు వెనుక భాగంలో స్వచ్ఛభారత్ లోగో, నంబరు ప్యానల్‌ లో ముందు స్టార్ గుర్తు ఉంటుందని తెలిపింది. స్టార్‌ గుర్తు గల రూ. 500నోట్లను ఆర్బీఐ తొలిసారిగా ముద్రిస్తున్నది. వీటిలోని ఫీచర్లను సులువుగా గుర్తించేందుకు వీలుంటుంది. స్టార్ గుర్తున్న 10 - 20 - 50 - 100 నోట్లు ఇప్పటికే చెలామణిలో ఉన్నాయి.
Tags:    

Similar News