అగ్రిగోల్డ్ పై సీబీ'ఐ' ?

Update: 2015-07-27 10:20 GMT
అగ్రిగోల్డ్ కుంభకోణంలో హైకోర్టు చొరవ చూపింది... అగ్రిగోల్డ్ కుంభకోణంలో వేల మంది నష్టపోతున్నా ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదని... దీనిపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ వచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో ఎంతమందిని అరెస్టు చేశారో చెప్పాలని తెలుగు రాష్ట్రాలను కోరింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంతవరకు తీసుకున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని కూడా ఆదేశించింది.

కాగా అగ్రిగోల్డ్ సంస్థ ఎపి, తెలంగాణలలో సుమారు ఏడు వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసింది. కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల చెల్లింపులో జాప్యం చేస్తుండడంతో ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే..  ఈ సంస్థకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నా,వాటిని విక్రయించి పరిష్కారం చేయడం వంటివి జరగడం లేదు. దీనిపై పలు రకాలుగా ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు డిపాజిట్ దారులు,ఏజెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ 'తెలంగాణ అగ్రిగోల్డ్  కస్టమర్లు, ఏజెంట్ల సంఘం పిటిషను వేయడంతో కోర్టు స్పందించింది. హైదరాబాద్ కు చెందిన రమేష్ బాబు నేతృత్వంలో వేసిన ఈ పిటిషన్ లో వారు సుమారు 40 లక్షల మంది డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా అగ్రిగోల్డ్ మోసం చేసిందని ఆరోపించారు.

కాగా ఈ కేసు తీవ్రతను బట్టి... లక్షల మంది ప్రయోజనాలతో ముడిపడిన అంశం కాబట్టి సీబీఐ విచారణ అసవరమన్న వాదన వినిపిస్తోంది. దేశంలో... మరీ ముఖ్యంగా మన సమీప రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో శారదా గ్రూప్, అర్ధతత్వ సహా పదుల సంఖ్యలో ఆర్థిక సంస్థలు చేసిన మోసాలు కొద్దికాలంగా బయటపడుతున్నాయి. ఈ కేసులను సీబీఐ విచారిస్తోంది. ఆయా సంస్తల కారణంగా ఏపీలోనూ కొందరు నష్టపోయారు. అయితే.. అగ్రిగోల్డు సంస్థ మోసాలు కూడా ఆ తరహావే కావడం.. భారీ ఎత్తున మోసాలు ఉండడంతో సీబీఐ విచారణను కోరుతున్నారు.
Tags:    

Similar News