మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితులందరినీ సీబీఐ విచారించేట్లే ఉంది. ఎవరిమీదైతే తనకు అనుమానం ఉందని వివేకా కూతురు సునీతారెడ్డి పేర్లిచ్చారో వాళ్ళందరినీ సీబీఐ విచారించేట్లే ఉంది. ఇప్పటికే కొందరిని విచారించింది. మరికొందరిని విచారిస్తోంది. ఇంకా విచారణకు పిలవాల్సిన వాళ్ళున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి సుమారుగా ఆరుమంది దాకా వైఎస్ కుటుంబీకులను సీబీఐ విచారించింది.
పులివెందుల కేంద్రంగా ఆర్డీబీ గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. వైఎస్ ప్రతాప్ రెడ్డి, వైఎస్ ప్రభాకరరెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిలను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన సోదరుడు వైఎస్ మనోహర్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారట.
ఇప్పటివరకు సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ కుటుంబసభ్యులందరు జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువులే. కాబట్టి విచారణకు హాజరవ్వాల్సిన వారు కూడా దగ్గర బంధువులే అయ్యుంటారనటంలో సందేహంలేదు. తన తండ్రి హత్యలో అనుమానితులని సునీతారెడ్డి పేర్లివ్వటమంటే మామూలు విషయంకాదు. ఎందుకంటే వీళ్ళంతా సునీతకు కూడా దగ్గర బంధువులే అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఉత్త అనుమానితులే అని సునీత పేర్లిచ్చిందా లేకపోతే తన దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎందుకంటే కేవలం అనుమానితులన్న సాకుతో దగ్గర బంధువులపై సునీత ఫిర్యాదు చేసేందుకు లేదు. తన దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉండబట్టే సునీత ఫిర్యాదు చేసిందనే అనుకోవాలి. ఆధారాలు లేకపోయినా అనుమానాలకు లాజికల్ కారణాలైనా ఉండే ఉండాలి. అందుకనే అందరిపైనా ఇంత గట్టిగా ఫిర్యాదు చేశారు. మరి చివరకు సీబీఐ ఏమి చేస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.