దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక మాజీ మంత్రి రాసలీలల సీడీ వ్యవహారంలో మిస్టరీగా మారిన యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. సీడీ బయటకు వచ్చిన తర్వాత నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఆమె ఆచూకీ లభించకపోవటంతో ఆమె భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సీడీలోని యువతికి సంబంధించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.
బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో అద్దెకు ఉండే ఆమె.. సీడీ బయటకు వచ్చిన వెంటనే గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. తాజాగా ఆమె గోవాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో తన ఇంటి ఓనర్ కు ఫోన్ చేసిన సదరు యువతి.. తన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంటి ఓనర్ కు క్షమాపణలు చెప్పినట్లుగా చెబుతున్నారు. ‘ నా కారణంగా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నన్ను క్షమించండి. త్వరలోనే తిరిగి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తా’ అని చెప్పినట్లు తెలుస్తోంది.
తనకు ప్రాణహాని ఉందన్న యువతి మాటల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు చెప్పారు. ఇదిలా ఉంటే.. సీడీలోని యువతిది విజయపుర జిల్లా నిడగుంది పట్టణంగా గుర్తించారు. అక్కడి ఆమె ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసు విచారణకు హాజరు కావాలని కోరుతూ గోడ మీద నోటీసు అంటించి వెళ్లారు. దీంతో.. ఆమె ఇంటి ఆచూకీ పబ్లిక్ అయ్యిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.