నిన్నటికి నిన్న తీసుకోవాల్సిన దాని కంటే రుణాన్ని తీసుకున్న వైనంపై ఏపీ సర్కారుకు కేంద్రం షాకివ్వటం తెలిసిందే. అదే పనిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఏపీలో డెవలప్ మెంట్ తగ్గిపోవటమే కాదు.. అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రం త్వరగా డెవలప్ కావాలంటే.. మౌలిక సదుపాయాల మీద ఫోకస్ చేస్తే.. దాని వల్ల కలిగే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మరిన్ని పరిశ్రమలు.. సేవా సంస్థలు రావటం వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. కానీ.. అందుకు భిన్నంగా ఏపీ పరిస్థితి ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఎంతకు సంక్షేమ పథకాల మీద వేలాది కోట్లు ఖర్చు పెట్టటం.. ఆదాయాన్ని జనరేట్ చేసే వాటిపై ఫోకస్ తగ్గటం కారణంగా.. ఇప్పుడో సిత్రమైన పరిస్థితి ఏపీ ఎదుర్కొంటోంది. సాధారణంగా కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కంటే కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా ఆదాయ వనరును పెంచుకుంటుంది. అందుకు భిన్నంగా ఏపీ పరిస్థితి ఉందని చెబుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. గత ఆరు బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను.. పన్నేతర మార్గాల నుంచి మొత్తం రూ.4,46,741 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. రూ.3,31,531 కోట్లు వచ్చింది. అంటే.. ఆరేళ్ల అంచనాల్లో సగటున 69.5 శాతం ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
గడిచిన మూడేళ్లలో రాష్ట్ర సొంత వాస్తవ ఆదాయం రూ.60వేల కోట్లను దాటిందని చెప్పారు. 2018-19లో గరిష్ఠంగా రూ.62,427 కోట్ల ఆదాయం రాగా.. 2019-20లో రూ.60,916 కోట్లు.. 2020-21లో రూ.60,687 కోట్లు వచ్చినట్లు చెప్పారు. కరోనా కారణంగా ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్ర సొంత ఆదాయం తగ్గుదల కాగా.. కేంద్రం నుంచి వచ్చిన పన్నులు. ఇతర సాయాల రూపంలో వచ్చిన ఆదాయం రూ.16,0987 కోట్లు పెరిగినట్లుగాపేర్కొన్నారు.
విభజన తర్వాత కేంద్రం నుంచి పన్నుల వాటాలు.. కేంద్ర సాయం.. రుణాలు.. అడ్వాన్సుల రూపంలో ఏపీకి రూ.4,07,488 కోట్లు రాగా.. తెలంగాణకు రూ.2,99,811 కోట్లు వచ్చాయి. అంటే.. తెలంగాణ నుంచి ఏపీకి కేంద్రం నుంచి ఎక్కువ మొత్తం నిధులు వచ్చినప్పటికీ.. ఏపీ సొంతంగా జనరేట్ చేసుకునే ఆదాయం తక్కువగా ఉండటం.. భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.