13 రాష్ట్రాలకు కేంద్రం షాక్

Update: 2022-08-19 04:23 GMT
విత్యుత్ కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో కేంద్రప్రభుత్వం 13 రాష్ట్రాల డిస్ట్రిబ్యూటరీ కంపెనీలకు పెద్ద షాకిచ్చింది. షాక్ తిన్న  13 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణా కూడా ఉంది. ఉత్పత్తి సంస్ధలకు ఈ 13 రాష్ట్రాలు బకాయిలు చెల్లించని కారణంగానే కేంద్రప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేంతవరకు డిస్కంలు ఇంధన ఎక్స్ చేంజీలనుండి విద్యుత్ ను కొనేందుకు లేదు అలాగే మిగులు విద్యుత్తంటే అమ్మేందుకు కూడా లేదని బ్యాన్ పెట్టేసింది.

వివిధ ఉత్పత్తిసంస్ధల నుండి కొనుగోలుచేసిన విద్యుత్ కు రాష్ట్రాలు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టేశాయి. కేంద్రం విధించిన బ్యాన్ ఎత్తేసేంతవరకు డిస్కంలకు ఇబ్బందులు తప్పవు. బ్యాన్ ఎత్తేయాలంటే అర్జంటుగా బకాయిలు మొత్తాన్ని చెల్లించాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఈ బ్యాన్ పీరియడ్ లో ఎక్కడైనా విద్యుత్ కోతలుంటే జనాలకు అవస్తలు తప్పవు.

ఏదైనా సాంకేతిక కారణాల వల్లో లేకపోతే చెట్లుపడి విద్యుత్ తీగలు తెగిపోవటంవల్ల అంతరాయాలు ఏర్పడితే సరిచేస్తారంతే. అంతేకానీ డిమాండ్ బాగా పెరిగిపోయి సరఫరా చేయలేక విద్యుత్ కోతలు మొదలైతే మాత్రం దాన్ని సర్దుబాటుచేయలేరు.

ప్రస్తుతం ఏపీ విద్యుత్  ఉత్పత్తి సంస్ధలకు రు. 350 కోట్లు బకాయుంది. అలాగే తెలంగాణా రు. 1600 కోట్ల బకాయిపడింది. రెండురాష్ట్రాలు బకాయిలు చెల్లించేవరకు పరిస్ధితిలో మార్పురాదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. అయితే డిస్కంలేమో కేంద్రం లెక్కల్లో తప్పులున్నాయని వాస్తవ లెక్కలు పరిశీలించి కొనుగోళ్ళకు అవకాశాలు ఇవ్వాలని మొత్తుకుంటున్నాయి.

లేట్ పేమెంట్ సర్చార్జి (ఎల్పీఎస్) నిబంధనల్లో భాగంగానే కేంద్రం ప్రత్యేక పోర్టల్ ను 2002లోనే ప్రారంభించింది. కొన్న విద్యుత్ ను చేసిన పేమెంట్లను అన్నీ డిస్కంలు ఈ ప్రత్యేకపోర్టల్లో అప్ లోడ్ చేస్తాయి. అప్ లోడ్ చేసిన తేదీని ప్రామాణికంగా తీసుకుని బకాయిలు ఉన్నాయంటు కేంద్రం ఇంధన శాఖ గట్టిగా పట్టుబడుతోంది. ఈ సాంకేతిక సమస్య సెటిలయ్యేంతవరకు అవసరమైతే బహిరంగమార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు డిస్కంలు రెడీ అవుతున్నాయి.
Tags:    

Similar News