మన దేశంపై విష ప్రచారం చేయడానికి పాకిస్థాన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. నేరుగా పోరాడే ధైర్యం లేక దొంగ దెబ్బతీయాలని చూస్తుంటుంది. మతం పేరుతో గందరగోళం సృష్టించడం, ఉగ్రవాదులను తయారు చేయడం లాంటివి చేస్తుంది. అయితే తాజా సోషల్ మీడియాలో భాగమై.. భారత్ పై విషం చిమ్మేఅందుకు మరోసారి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు క్రియేట్ చేసి మన దేశంపై అవాస్తవాలను ప్రసారం చేస్తోంది. అయితే ఇలా ఫేక్ న్యూస్ ను ప్రసారం చేసే కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల మీద కేంద్రం కొరడా ఝులిపించింది. సుమారు 35 ఛానెళ్లను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ యూట్యూబ్ ఛానెళ్లలో ప్రముఖంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సమాచారంతో పాటు కాశ్మీర్ ఇష్యూ మీద కూడా వివిధ రకాలైన వీడియోలు చిత్రీకరించి ప్రసారం చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా మన దేశ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం కూడా వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల చనిపోయిన ఛీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణానికి సంబంధించిన ఫేక్ న్యూస్ ను ప్రసారం చేసినట్లు కేంద్రం గుర్తించింది. ఈ కారణంగా వాటిపై కొరడా ఝుళిపించినట్లు పేర్కొంది.
కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చెప్పిన దాని ప్రకారం 35 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు ట్విట్టర్ అకౌంట్లు, మరో రెండు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేసింది. వీటితో పాటు ఫేక్ న్యూన్ ను విస్తరిస్తున్న మరో రెండు వెబ్ సైట్లను కూడా బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది. అంతేగాకుండా మరో పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మరో ఫేస్ బుక్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది.
బ్లాక్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ సైట్లు అన్నీ మన దేశానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ ను స్ప్రేడ్ చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. వార్తలు ప్రసారం చేయడం కంటే ఎక్కువగా వారు ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 130 కోట్లకు పైగా మంది చూసినట్లు వెల్లడించారు. వీటికి 1.2 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నట్లు గుర్తించింది. ఆప్నీ దునియా నెట్ వర్క్ అనే సంస్థ సుమారు 14 ఛానెళ్లను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ అనే మరో సంస్థ 13 యూట్యూబ్ ఛానెళ్లను రన్ చేస్తుందిని పేర్కొన్నారు. వీటినన్నింటిని చట్టానికి లోబడే బ్లాక్ చేసినట్లు తెలిపారు.