కేంద్రం కీలక నిర్ణయం .. లక్షణాలు లేకపోయినా ఆ మందు ఇవ్వండి !

Update: 2020-05-23 05:30 GMT
కంటికి కనిపించని ఓ మహమ్మారితో ఇప్పుడు ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది. మన దేశంలో కూడా రోజురోజుకి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టడానికి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేసారు. దీనితో కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది అయితే ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోని లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇకపోతే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ..ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా దీనికి సరైన వ్యాక్సిన్ ను ఇంకా తయారుచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మలేరియా డ్రగ్ ను ఈ వైరస్ చికిత్స కోసం వాడుతున్నారు.

ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ మందు వైరస్ కి  చెక్ పెట్టగలదని ఫిక్స్ అయిపోయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. రెండు నెలల కిందట ఓ పరిశోధన చేసినప్పుడు, ఆ రిపోర్ట్ చూసి అమెరికా ఆశ్చర్య పోయింది. వైరస్ కీ మలేరియాకీ ఏంటి సంబంధం అని అమెరికాలో పరిశోధకులంతా లోతుగా ఆలోచించారు. వాళ్లు చెప్పిందేంటంటే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తి పెద్దగా లేదు. కారణం ఏంటంటే, ఆ ఖండాల్లో ప్రజలు దోమల నుంచి వచ్చే మలేరియా మందుల్ని ఎక్కువగా వాడుతున్నారనీ. అదే మందు  వైరస్‌ కి కూడా చెక్ పెడుతోందనీ, అందుకే ఆఫ్రికా, ఆసియా ప్రజలకు ఈ వైరస్ ఎక్కువగా సోకట్లేదని తేల్చారు.

దీనితో కేంద్రం  మలేరియా నివారణకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి... 60కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. మన దేశంలో కరోనా వైరస్‌ సోకిన పేషెంంట్లకు, వారికి ట్రీట్‌మెంట్ చేస్తూ వైరస్‌ తో పోరాడుతున్న డాక్టర్లు, ఫ్రంట్‌ లైన్ హెల్త్ వర్కర్లు, వైద్య సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇస్తున్నారు. అయితే,   ఇప్పటివరకూ వైరస్ లేని ప్రాంతాల్లో హెల్త్ కేర్ వర్కర్లకు వైరస్ లక్షణాలు లేకపోతే, ఈ మందు ఇవ్వట్లేదు. ఇప్పుడు కేంద్రం దేశంలో  కేసులు పెరుగుతుండటంతో లక్షణాలు లేకపోయినా హెల్త్ కేర్ వర్కర్లు అందరికీ, అన్ని ప్రాంతాల్లో వారికీ ఈ మందును ఇవ్వాలని ప్రతిపాదించింది. దీన్ని బట్టి  చూస్తే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును కేంద్ర ప్రభుత్వం కరోనాకి సరైన మందుగా భావిస్తోందని అనుకోవచ్చు.
Tags:    

Similar News