పోలవరంపై కేంద్రం మరో పిడుగు

Update: 2021-03-21 06:15 GMT
ఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరంపై కేంద్రం మరో పిడుగు వేసింది. కొంతకాలంగా అందరూ అనుమానిస్తున్నట్టే కేంద్రం పెద్ద బండ వేసింది. పోలవరం పెరిగిన అంచనాలకు నో చెబుతూ జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.

విభజన హామీల్లో ప్రధానమైన పోలవరం నిర్మాణ వ్యయం అంచనా ఇప్పటికే రెట్టింపుకాగా.. ఆ అదనపు ఖర్చును తాము భరించలేమంటూ కేంద్రం కుండబద్దలు కొట్టింది.  పాత లెక్కకు మించి ఒక్కపైసా కూడా ఇవ్వొద్దంటూ జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ ఈ మేరకు స్పష్టం చేసింది.

2014 ఎన్నికల్లో మోడీ-జగన్ గెలిచాక పోలవరంను తామే నిర్మిస్తామని చంద్రబాబు సర్కార్ ముందుకొచ్చి జాప్యంచేసింది. ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో అంచనావ్యయం రెట్టింపు అయ్యింది. చివరగా 2017లో ఆమోదించిన మొత్తాన్నే ఇస్తామని కేంద్రం చెబుతుండగా.. పెరిగిన వ్యయం కేంద్రమే భరించాలని జగన్ సర్కార్ రెండేళ్లుగా కోరుతోంది.

తాజాగా జగన్ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. పాత అంచనాలకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సవరించిన అంచనాలతో రూ.55,658.87 కోట్లు అవసరమని జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్రం తిరస్కరించింది. పోలవరంకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వవద్దంటూ కేంద్ర జలవనరుల శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. హెడ్ వర్క్స్ - భూమి - పునరావాసాలకు పాత మొత్తాలే డిసైడ్ చేసింది.

జగన్ మోడీకి, కేంద్ర జలశక్తి మంత్రికి ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఏపీ కలల ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


Tags:    

Similar News