దీదీ ద‌మ్ము కుమార‌స్వామికి ఉందా?

Update: 2019-02-04 04:14 GMT
జాతీయ‌వాదులు మొద‌లు ప్ర‌జాస్వామ్య వాదుల వ‌ర‌కూ అంతా నోరు మూసుకొని ఉన్న‌ప్పుడు వ్య‌వ‌స్థ‌లు ఎలా త‌మ‌కు చిత్తం వ‌చ్చిన‌ట్లు ఎలా చెల‌రేగిపోతాయో మోడీ జ‌మానాను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రైనా స‌రే.. జైలుకు వెళ్ల‌ట‌మో.. సీబీఐకి చిక్క‌ట‌మో.. కాదంటే ఈజీ పంజాకు కునారిల్ల‌ట‌మో చూస్తున్న‌దే. దాదాపు ఐదేళ్ల మోడీ హ‌యాంలో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఎంత‌లా చెల‌రేగిపోయారో ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌మ చేత‌ల‌తో చూపించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం (2015) హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీర‌భ‌ద్ర‌సింగ్ పై సీబీఐ అవినీతి కేసు న‌మోదు చేసింది.

వీర‌భ‌ద్ర‌సింగ్ కుమార్తె పెళ్లి రోజున‌.. ఇంటి నుంచి వివాహ వేదిక వ‌ద్ద‌కు సీఎం కుటుంబ స‌భ్యులు వెళ్లిన కాసేప‌టికి సీబీఐ అధికారులు సీఎం నివాసానికి నేరుగా వెళ్లి త‌నిఖీలు చేయ‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. అంతేనా.. వీర‌భ‌ద్ర‌సింగ్ కుటుంబ స‌భ్యులు.. వారికి స‌న్నిహితులుగా పేరున్న వారికి చెందిన ఇళ్ల‌ల్లో ఏక‌కాలంలో 11 చోట్ల త‌నిఖీలు నిర్వ‌హించారు. ఓప‌క్క కుమార్తె వివాహం జ‌రుగుతున్న వేళ‌.. మ‌రోవైపు సీబీఐ నేరుగా ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి నివాసంలోకి వెళ్లి మ‌రీ సీబీఐ అధికారులు త‌నిఖీలు చేయ‌టంపై అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ త‌ర‌హా త‌నిఖీలు ఒక్క సీబీఐ మాత్ర‌మే కాదు.. ఈడీ అధికారులు చేశారు. అయితే.. ఇవ‌న్నీ బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. అలా ప‌లు రాష్ట్రాల్లో ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌కు షాకులు ఇస్తూ వ‌చ్చిన సీబీఐ తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ పై గురి పెట్ట‌టం.. ఊహించ‌ని రీతిలో అక్క‌డ సీన్ రివర్స్ కావ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సీబీఐ అధికారులు దేశంలో ఎక్క‌డికైనా వెళ్లొచ్చు. ఆ పేరుతో ఇష్టం వ‌చ్చిన రీతిలో.. త‌గిన ప‌త్రాలు లేకుండా ఎవ‌రింటికి ప‌డితే వారింటిపైకి వెళ్లిపోతే అన్ని వ్య‌వ‌స్ధ‌లు వీర‌భ‌ద్ర‌సింగ్ మాదిరి ఉండ‌క‌పోవ‌చ్చు.

తాజాగా క‌ర్ణాట‌క మీద గురి పెట్టిన మోడీ స‌ర్కారు.. ఇప్ప‌టికే అక్క‌డి ప్ర‌భుత్వానికి చుక్కలు చూపించేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ క‌మ‌ల‌లో భాగంగా కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లేలా వ్యూహాలు సిద్దం చేసినా.. అవేమీ వ‌ర్క్ వుట్ కాలేదు. ఇలాంటివేళ‌..క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంటు షాకులు త‌గిలేలా చేయ‌టంలో సిద్ధ‌హ‌స్తుడు.. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు జ‌రిగే కుట్ర‌ల్ని డీకోడ్ చేయ‌టంలో ఘ‌నాపాఠిగా చెప్పే కాంగ్రెస్ నేత డీకేఎస్ అలియాస్ డీకే శివ‌కుమార్ పై గురి పెట్ట‌టం తెలిసిందే.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీకేఎస్ తో  స‌హా ఆయ‌న అనుచ‌రుల్ని ఈడీ ఆరెస్ట్ చేసేందుకు ఇప్ప‌టికే రంగం సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. కర్ణాట‌క కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్ ఈడీ క‌బంధ హ‌స్తాల్లోకి వెళితే.. కీల‌క‌మైన లోక్ స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ కు త‌గిలే దెబ్బ అంతా ఇంతా కాదు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. డీకేఎస్ ను ఇటీవ‌లే ఆదాయ‌ప‌న్ను శాఖాధికారులు పెద్ద ఎత్తున విచారించారు. క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ మైత్రితో సాగుతున్న జేడీఎస్ స‌ర్కారును దెబ్బ తీసేందుకు డీకేఎస్ ను అదుపులోకి తీసుకోవాల‌న్న ప్లాన్ లో కేంద్ర విచార‌ణ సంస్థ‌లు ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటివేళ‌.. ప‌శ్చిమ‌బెంగాల్ లో దీదీ మాదిరి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి చెల‌రేగిపోతే మోడీ స‌ర్కారుకు షాకులేన‌ని చెప్పాలి. మ‌హా అయితే మ‌రో రెండు వారాలు.. లేదంటే మ‌రో వారం మాత్ర‌మే మిగిలి ఉంది లోక్ స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌టానికి. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోని అవినీతి మీద ఈడీ.. సీబీఐలు దృష్టి సారించ‌టం ఏమిటి?  మోడీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రైనా స‌రే.. కేసులు.. అరెస్ట్‌ లు త‌ప్ప‌వా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌లుగా మారుతున్నాయి.
Tags:    

Similar News