జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్

Update: 2021-03-26 07:58 GMT
ఏపీలో జగన్ గద్దెనెక్కగానే గత చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పటివరకు వీటిపై ఎక్కడా చర్చ లేకపోయినా వైసీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ ఒప్పందాలు రాష్ట్రానికి గుదిబండగా మారాయన్న చర్చను తెరపైకి తెచ్చింది. వీటిని సమీక్షించేందుకు దూకుడుగా వెళ్లారు. రద్దు చేశారు.కానీ హైకోర్టుతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్రేకులు వేయడంతో ఆ వ్యవహారం ఇక తెరమరుగైంది. ఇన్నాళ్లకు కేంద్రం విద్యుత్ ఒప్పందాలపై జగన్ సర్కారుకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

గత చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం మార్కెట్లో దొరికే సోలార్, విండ్ పవర్ కు 11 రూపాయల చొప్పున చెల్లించాడు. కేవలం రూ.3, రూ.4 యూనిట్ కు దొరికేది అంత ధరకు కొనడాన్ని జగన్ సమీక్షించారు. ఈ ఒప్పందాల విలువ రూ.25వేల కోట్లు దాటడంతో జగన్ వీటిని రద్దు చేశారు. రాష్ట్రానికి గుదిబండ అని వైదొలిగారు.

జగన్ అభ్యంతరాలనే పీపీఏలపై రాష్ట్రాలు కూడా లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు గడువు తీరిన పీపీఏలను కొనసాగించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ సీజీఎస్ తో రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోయాక వాటిని ఉపసంహరించుకునేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

పీపీఏలు గడువు ముగిసిన తర్వాత డిస్కంలు కోరుకుంటే మాత్రం ఒప్పందాలు పునరుద్ధరిస్తారు.
Tags:    

Similar News