మోడీ స్వార్థం ఖాతాలో ఈ ప్ర‌త్యేక‌త కూడా చేరింది

Update: 2018-08-11 17:17 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీ ప్లేన్‌లో ప్ర‌యాణించిన సంగ‌తి తెలిసిందే. గుజరాత్‌  పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ...తొలిసారి సీ ప్లేన్‌ లో ప్రయాణం చేశారు. సబర్మతి నది నుంచి సీప్లేన్‌ ద్వారా ధారోయ్‌ డ్యామ్‌ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ గుజరాత్  అభివృద్ధి గురించి మాట్లాడటం లేదన్న కాంగ్రెస్‌ విమర్శలకు ట్విట్టర్  ద్వారా స్పందించిన ఆయన.. ఆ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి ఉండదని కౌంటర్ ఇచ్చారు.  దేశంలోని అన్నిచోట్లా ఎయిర్‌ పోర్టులో నిర్మించడం సాధ్యం కాదని, అందుకే వాటర్‌ వేస్‌ పై దృష్టిపెట్టామని ట్వీట్‌  చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ సీప్లేన్‌ లో సబర్మతి నదిలో ల్యాండ్ అయినప్పటి నుంచీ మనదేశంలో ఈ తరహా రవాణాపై ఆసక్తి పెరిగింది. అయితే, దీన్ని మ‌రింత ముందుకు తీసుకుపోయే క్ర‌మంలో...ప్ర‌ధాని ఈ ప‌రిణామాన్ని త‌న సొంత ఆస‌క్తికి అనుగుణంగా ఉప‌యోగించుకున్నార‌ని టాక్ వ‌స్తోంది.

సీప్లేన్ ర‌వాణాను విస్తృతం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. ఎందుకంటే... మామూలు విమానాలకు ఎయిర్‌ పోర్టు కట్టాలంటే పెద్దస్థలం - బోలెడు డబ్బు అవసరం. కానీ సీప్లేన్‌ ల‌కు అలాంటి అవ‌స‌రం లేదు. నీటి ఏరోడ్రోమ్‌ లకు పెద్దపెద్ద చెరువులు లేదా నదుల వంటి నీటి వనరులు సరిపోతాయి. మూరుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నీటి ఏరోడ్రోమ్‌ లకు శనివారం అనుమతి మంజూరు చేసింది. కేంద్ర విమానయాన శాఖమంత్రి సురేశ్ ప్రభు ట్విట్టర్‌ లో ఈ సంగతి వెల్లడించారు. ఈ విమానాలతో టూరిజం వృద్ధి చెందుతుందని - పుణ్యక్షేత్రాలకు రాకపోకలు సులభమవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇక్క‌డే ట్విస్ట్ చోటుచేసుకుంది.  తొలిదశలో ఒడిశా - గుజరాత్ - మహారాష్ట్ర - ఏపీ - అసోంలలో నీటి ఏరోడ్రోమ్‌ ల నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

తొలిదశ ప్రాజెక్టులో చిల్కా సరస్సు (ఒడిశా) - సబర్మతి రివర్‌ ఫ్రంట్ - సర్దార్ సరోవర్ డ్యాంలను ఎంపిక చేసినట్టు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. చిత్రంగా ఈ రెండూ గుజరాత్‌ లోనే ఉన్నాయి. అంటే మోడీజీ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త అది కూడా ఆయ‌న రాష్ర్టానికే చెంద‌నుందన్నమాట‌. ఇదిలాఉండ‌గా...పవన్‌ హంస్ - స్పైస్‌ జెట్ వంటి సంస్థలు నీటి విమానాల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నాయి. స్థూలంగా త్వరలో ఇక దేశంలో నీటి విమానాల సందడి మొదలు కానున్న‌ద‌న్న‌మాట‌.
Tags:    

Similar News