తెలుగు రాష్ర్టాల‌ను కామెడీ చేసేస్తున్న కేంద్రం

Update: 2017-03-24 10:35 GMT
భార‌త రాజ్యాంగం ప్ర‌కారం అత్యున్నత నిర్ణ‌యాల వేదిక మ‌న పార్లమెంటు. ఇక్కడ కేంద్రమంత్రులు చేసే లిఖితపూర్వక ప్రకటనలు చట్టబద్ధమైనవి. అలాంటి పార్లమెంటు సాక్షిగా రెండు తెలుగు రాష్ర్టాలు కామెడీ పాల‌వుతున్నాయ‌నే చ‌ర్చ వినిపిస్తోంది. ఇదంతా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న గురించింది. తెలుగు రాష్ర్టాల్లోని అధికార పార్టీల‌కు అత్యంత ఇష్ట‌మైన అంశంమైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న గురించి అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారం లిఖితపూర్వకంగా ఓ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభన చట్టం ప్రకారం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170(3) అధి కరణకు సవరణలు చేయడం తప్ప, మరో దారి లేదని, ఇందుకోసం 2026 దాకా ఆగాల్సిందేనని చెప్పారు.

అయితే కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి ప్ర‌క‌ట‌న వెలువ‌డిన రోజు సాయంత్ర‌మే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయంపై కేంద్ర హోంశాఖ నోట్‌ తయారు చేస్తోందని ప్రకటించారు! తద్వారా సంబంధింత శాఖా మంత్రి కంటే పూర్తి విరుద్ధ‌మైన స‌మాచారాన్ని వెంకయ్య నాయుడు వెల్ల‌డించారు. ఈ ట్విస్ట్‌కి కొన‌సాగింపు అన్న‌ట్లుగా కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తెరపైకి వచ్చారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచటానికి లైన్‌ క్లియర్‌ చేస్తామని ఎంపీలకు భరోసా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే..పార్ల‌మెంటులో ఇచ్చే హామీల విలువ ఎంత అనే సందేహం క‌లుగుతోంది. సాక్షాత్తు కేంద్రమంత్రి హన్స్‌ రాజ్‌ అధికారికంగా, లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రకటనకి విలువెంత అన్న ప్రశ్న ముందుకొచ్చింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న నోటు తయారు చేయాల్సింది హోంశాఖే కావడం గమనించాల్సిన విషయం. అయితే ఆ శాఖతో సంబంధంలేని వెంకయ్య నోటు గురించి ప్రకటించడం ఆస‌క్తిక‌రం. త‌న స‌హాయ‌మంత్రి కంటే భిన్న‌మైన నిర్ణ‌యం హోం మంత్రి చెప్ప‌డం ఇంకో ట్రాజెడీ!

ఇక నిబంధ‌న‌ల ప్ర‌కారం చూస్తుంటే ప్రతి  జనాభా లెక్క‌ల అనంతరం జనాభాకు అనుగుణంగా-చట్టం నిర్దేశించిన ప్రకారం- అవసరమైతే పార్లమెంట్‌ ఆమోదంతో రాష్ట్ర అసెంబ్లీల్లో శాసనసభ్యుల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయవచ్చు. రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ప్రకారం శాసనసభ్యుల సంఖ్య సర్దుబాటుకు వర్తిస్తుంది. అయితే ఈ ప్రక్రియ అప్పటి శాసన సభ రద్దయ్యేంత వరకూ దాని ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం చూపరాదు. దీని ప్రకారం చూస్తే ఏపీ - తెలంగాణ అసెంబ్లీల్లో సభ్యుల సంఖ్యను ఇప్పటికిప్పుడు పెంచే పరిస్థితి లేదు. 2022 జనగణన అనంతరం 2026లో మాత్రమే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్యను పెంచే వెసులుబాటు ఉంటుంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026వరకూ అసెంబ్లీ సీట్ల సంఖ్యలో మార్పు చేర్పులు చేయకుండా సీలింగ్‌ విధించారు. దీంతో విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పెంపు అమలుకు అవరోధం ఏర్పడింది. అయితే 170 (3) అధికరణ సవరణతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమవుతుందని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున త‌న వాద‌న వినిపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News