ఉత్తరాంధ్ర ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తున్న రైల్వే జోన్‌ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. జోన్ ఇచ్చే తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కానీ - సమావేశాలు ముగిసిన వెంటనే కానీ జోన్ పై కేంద్రం ప్రకటన చేయబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు జోన్ ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
కొత్తగా ఏర్పడే రైల్వే జోన్ లో ఒడిశా భూభాగం లేకుండా ఒక ప్రతిపాదన - కిరండోల్ రైలు మార్గాన్ని వాల్తేరు డివిజన్ లోనే ఉంచుతూ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. రైల్వే మంత్రి అయితే.. కేకే లైన్ ను విశాఖ జోన్ లో ఉంచితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, విశాఖ ప్రాంతానికే కాకుండా - ఏపీ మొత్తాన్ని ప్రభావితం చేసే రైల్వే జోన్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈనెల 28 నుంచి 31 మధ్యలో విశాఖకు చెందిన బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచే రైల్వే జోన్ తేదీని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లో ఏపీకి తీసుకురావాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఈ సంగతి గుర్తించిన టీడీపీ నేతలు జోన్ క్రెడిట్ బీజేపీకి రాకుండా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.