‘నేను ఎప్పుడు బయటికి వచ్చినా.. మాస్కు తీయలేదు. మా ఇంట్లో కూడా తీయను. కానీ.. జనాలు మాస్కు లేకుండానే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా రాదా?’ అని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్ అన్నారు. ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
జనాల నిర్లక్ష్యం కారణంగానే సెకండ్ వేవ్ విజృంభిస్తోందని, కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయని అన్నారు. కరోనా నిబంధనలను ఎవ్వరూ ఉల్లంఘించొద్దని, ఒక్కరు తప్పు చేస్తే అందరూ శిక్ష అనుభవిస్తారని అన్నారు. అందువల్ల ఏ ఒక్కరు కూడా మాస్కు తీయొద్దని అన్నారు. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని కోరారు.
వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ.. అమెరికా కన్నా ఎక్కువగా ఇండియాలోనే వ్యాక్సిన్ అందుతోందని చెప్పడం గమనార్హం. కొన్నిరాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను రాజకీయం చేస్తున్నారని చెప్పారు. కాగా.. దేశంలో ఇప్పటి వరకూ 10 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ అందలేదని సమాచారం. తయారీ సంస్థలకు ప్రోత్సాహం అందకనే వ్యాక్సిన్ తయారీ మందగించిందనే ప్రచారం సాగుతోంది.