ఆయనో కేంద్రమంత్రి. నిత్యం రకరకాల వ్యాపకాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. అలాంటి ఆయన ఎవరూ ఊహించని రీతిలో సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఉన్నట్లుండి కేంద్రమంత్రి వర్యులకు కందిపప్పు మీద అంత ఆసక్తి ఎందుకు కలిగిందన్నది ప్రశ్నగా మారింది.
కేంద్రమంత్రి హర్షవర్ధన్ తాజాగా చేసిన పోస్టులో.. దేశ ప్రజలంతా నిత్యం కందిపప్పును తినాలని.. తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. నిత్యం కందిపప్పు తినటం ద్వారా ఆరోగ్య భారత్ సాధ్యమని వ్యాఖ్యానించటం విశేషం. కందిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని.. రోజు శరీరానికి అవసరమైన ఫైబర్ ను కందిపప్పు అందిస్తుందన్నారు. ఎందుకిదంతా ఆయన చెబుతున్నారంటే.. ఇటీవల కందిపప్పును తినే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పారు.
చాలామంది గుర్తించటం లేదు కానీ కందిపప్పులో సుగుణాల కుప్పగా ఆయన చెబుతున్నారు. కందిపప్పు జీర్ణశక్తిని మెరుగు చేయటమే కాదు.. మలబద్ధక సమస్యను కూడా తీరుస్తుందన్నారు. గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ రోజు కందిపప్పు తినాలన్నారు.
ఇప్పటివరకూ కేంద్రమంత్రి పదవిలో ఉన్న వారెవరూ.. ఒక పప్పును రోజూ తినాలని కోరింది లేదు. అందుకు భిన్నంగా హర్షవర్దన్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఏ మాటకు ఆ మాటే.. కందిపప్పుకు ఇప్పటివరకూ సరైన బ్రాండ్ అన్నది లేదు. కానీ.. కందిపప్పును ఇప్పటికే కాదు.. ఎప్పటికి తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ హర్షవర్ధన్ అవుతానటంలో సందేహం లేదు.