తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట సంఖ్యను పెంచేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరో ముందడుగు పడే ఛాన్స్ కనిపిస్తోంది. కేంద్ర హోం - న్యాయశాఖల అధికారులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నేడు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు మోకాలడ్డుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉన్నందున సెక్షన్ 26లో పేర్కొన్న అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలన్నదానిపై మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలంటే రాజ్యాంగంలోని 170వ అధికరణంతో వస్తున్న చిక్కును అధిగమించాల్సి ఉంటుంది. గతంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ లిఖితపూర్వక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని రెండు శాఖలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు శాఖల అధికారులు శుక్రవారం సమావేశమవుతున్నారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ అంశానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టాల్సి వస్తే సిద్ధంగా ఉండేందుకు వీలుగా ముసాయిదా తయారీపైనా అధికారులు ప్రత్యామ్నాయాలను సూచించే అవకాశం ఉంది.
అయితే తెలంగాణ - ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి కేంద్రం సుముఖంగానే ఉన్నా రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నేతలు అడ్డుపుల్ల వేయడంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. సీట్లను పెంచడంద్వారా 2019 సాధారణ ఎన్నికల్లో రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీకంటే అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ - టీడీపీలకే ఎక్కువ ప్రయోజనమని జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రెండు రాష్ర్టాల్లోని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా గత నెల 25న ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్రంలోని తమ పార్టీ నాయకులు సీట్ల సంఖ్యను పెంచవద్దని కోరారని చెప్తూనే.. అది వారి అభిప్రాయం మాత్రమేనని వివరణ ఇచ్చారు. రెండు రాష్ర్టాల బీజేపీ నాయకత్వం అవునన్నా కాదన్నా జాతీయ నాయకత్వం మాత్రం ఈ అంశాన్ని రాజకీయ కోణంనుంచే చూస్తోందని అంటున్నారు.
ఇక రాజ్యంగ ప్రక్రియ ప్రకారం చూస్తే సీట్ల సంఖ్య పెంపుదలకు రాజ్యాంగంలోని 170వ అధికరణం ఆటంకంగా ఉండడం, దీన్ని అధిగమించడానికి అవలంబించాల్సిన వైఖరి తదితరాలపై న్యాయశాఖ కార్యదర్శుల స్థాయివరకు లోతుగా చర్చలు సాగాయి. 170వ అధికరణంలో ఉన్న మూడు సబ్ క్లాజులకు అదనంగా మరొకదాన్ని చేర్చడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని ఒక అంచనాకు వచ్చారు. దీని ద్వారా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరే రాష్ట్రం నుంచైనా ఇలాంటి డిమాండ్ వస్తే దానికి అనుగుణంగా నిర్ణయానికి వీలుంటుందని, పదేపదే రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉండదనే చర్చలు జరిగాయి. ఏ మార్పు చేసినా అది రాజ్యాంగ సవరణే అవుతుంది కాబట్టి సింపుల్ మెజారిటీతో అధిగమించవచ్చునన్న అభిప్రాయాన్ని కేంద్ర మంత్రులు కూడా వ్యక్తంచేశారు.
పార్లమెంటు ప్రక్రియ తర్వాత నియోజకవర్గాల సంఖ్యను (పునర్వ్యవస్థీకరణ) పెంచే అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తుంది. డీలిమిటేషన్ కమిటీ వేయడం - క్షేత్రస్థాయి పర్యటనతోపాటు గణాంకాల ఆధారంగా హద్దులను నిర్ణయించడం - నివేదికను ఈసీ ఆమోదించడం.. ఇలా ప్రతి పనికీ సమయం పడుతుంది. కేంద్రం తీసుకునే నిర్ణయం 2019 సాధారణ ఎన్నికల సమయానికి అమల్లోకి రావాలి కాబట్టి ప్రక్రియకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. రెండు రాష్ర్టాల బీజేపీ నాయకుల నుంచి బహిరంగ వ్యతిరేకత వ్యక్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ నాయకత్వం ద్వారా ఆదేశాలు జారీ చేయిస్తారనే అభిప్రాయం ఉంది. న్యాయ మంత్రిత్వశాఖలోని శాసన వ్యవహారాల విభాగం (ఎన్నికల సంబంధిత సెక్షన్), కేంద్ర హోం శాఖ అధికారుల మధ్య జరిగే సమావేశం ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో తొలి అడుగుగా భావించవచ్చునని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/