లాక్ డౌన్ లో కూడా ఆగని సెంట్రల్ విస్తా పనులు .. అదే కారణమా ?

Update: 2021-04-28 07:33 GMT
సెంట్రల్‌ విస్తా ...  రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 3కి.మీ. పొడవు 1,100 ఎకరాల చారిత్రక ప్రదేశమే సెంట్రల్‌ విస్తా. 2019 సెప్టెంబర్‌లో మోడీ ప్రభుత్వం ఈ ప్రదేశంలో నూతన భవనాల పథకం ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కన త్రికోణ ఆకారంలో కొత్త భవన సముదాయం నిర్మిస్తారు. రేఖాగణితంలో త్రికోణం హిందూత్వ పవిత్ర చిహ్నం. ఇక్కడ ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతుల భవంతులు, మంత్రుల కార్యాలయాల కోసం బహుళ అంతస్తుల 10ఆధునిక భవనాలు నిర్మిస్తారు. సుప్రీంకోర్టు షరతులతో గత ఏడాది డిసెంబర్‌ 10న ప్రధాని శంకుస్థాపన చేశారు.  20 వేల కోట్లతో నూతన పార్లమెంట్‌ భవనం నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కరోనా దెబ్బకి మరోసారి దేశం మొత్తం అల్లాడిపోతోంది. కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు అడుగులు వేశాయి. అందులో ఢిల్లీ కూడా ఒకటి. ఢిల్లీ కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే , ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం నిత్యావసర సర్వీసుల పరిధి కిందకు తీసుకురావడమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రాజెక్టుపై సెకండ్ కోవిద్ ప్రభావం ఏ మాంత్రం పడలేదు. కార్మికులను, కూలీలను సమీప ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలించి నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఎక్కువమంది కూలీలను ఇక్కడికి సుమారు 16 కి.మీ. దూరంలోని కీర్తి నగర్ నుంచి తీసుకువస్తున్నారు. తమకు రోజుకు 600 రూపాయలు చెల్లిస్తున్నారని, షిఫ్ట్ కు 12 గంటలు పని  చేస్తున్నామని కార్మికులు తెలిపారు.

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేపట్టిన ఈ  సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా  2023 లో జరిగే సార్వత్రిక ఎన్నికల ముందే దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి  సిద్ధంగా ఉండాలని కేంద్రం దృఢంగా నిర్ణయం తీసుకుంది.  అయితే  కరోనా కాలంలో ఈ ప్రాజెక్టుపై నిధులను వెచ్చించే బదులు, వ్యాక్సిన్, ఆక్సిజన్,  వైద్య పరికరాలు, ఇతర అవసరాలకోసం నిధులను ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు సూచనలు చేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ఆ సెంట్రల్ విస్తా నిర్మాణం అవసరమా , అత్యంత ప్రధానమా అని ఆయన ప్రశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులను ప్రస్తుతానికి నిలిపివేసి, కరోనా అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆర్జేడీ నేత మనోజ్ ఝా డిమాండ్ చేస్తున్నారు.  కానీ కేంద్రం మాత్రం ఈ సూచనలను పట్టించుకోవడంలేదు. దీని నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు లోగడ జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ గుర్తు చేస్తోంది.
Tags:    

Similar News